English | Telugu
ఆ కరోనా పేషంట్ ఏమయ్యాడో తేల్చి చెప్పండి.. తెలంగాణ హైకోర్టు
Updated : Jun 4, 2020
కరోనా ధాటికి తెలంగాణాలో ఫ్యామిలీలకు ఫ్యామిలీలే ఐతే అటు క్వారంటైన్ కు లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులలో చేరుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి మధుసూదన్ ఫ్యామిలీ. గత మీ నెలలో గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ ఐన మధుసూదన్ అనే వ్యక్తి మరణించారా లేదా అనే విషయాన్నీ స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. ఒక వేళా మధుసూదన్ కరోనా తో మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఈ సందర్బంగా కోర్టు ప్రశ్నించింది.
గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మధుసూధన్ మరణంపై అయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గత మే నెల 21 న అయన భార్య మాధవి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తన భర్త ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ హెల్త్ మినిష్టర్ ఈటెల రాజేందర్ మధుసూదన్ చనిపోయే సమయానికి అయన భార్య కూడా గాంధీ లోనే చికిత్స పొందుతూ కోలుకుంటున్న పరిస్థితుల్లో ఆమెకు భర్త చనిపోయిన విషయాన్ని చెప్పలేదని తెలిపారు. ఐతే ఆ కుటుంబం లో మొదటిగా మధుసూదన్ తండ్రి కరోనా తో గాంధీ హాస్పిటల్ లో చ్చికిత్స పొందుతూ మరణించారు. ఆతరువాత మధుసూదన్ అయన భార్య కూడా కరోనా తో అదే ఆసుపత్రి లో చేరారు. ఐతే మధుసూదన్ మే 1 న మరణించారు. కానీ అయన భార్యకు కానీ కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలపక పోవడం తో ఈ పరిస్థితి ఏర్పడింది. ఐతే ఈ విషయమై అపుడే ఆమె న్యాయపోరాటం చేస్తానని ప్రకటిచింది. తాజాగా ద్దెని పై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.