English | Telugu
రాప్తాడులో ఉద్రిక్తత.. పరిటాల రవి పేరుతో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం
Updated : Jun 3, 2020
శిలా ఫలకాలను ధ్వంసం చేయడంపై సునీత, శ్రీరామ్‌లు మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని సునీత మండిపడ్డారు. కక్షపూరితంగా గ్రామాల్లో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని సునీత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే సంతోషించే మొదటి వ్యక్తిని తానేనన్నారు. గతంలో పేరూరు డ్యామ్ కు రూ. 804 కోట్లు కేటాయించామని సునీత చెప్పారు.