English | Telugu

Brahmamudi: రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు.. డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -903 లో... కావ్యకి ఇక ఏ ప్రాబ్లెమ్ లేదని ఆయుర్వేద వైద్యం చేసిన అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

మరొకవైపు సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. ఎందుకంటే మన కంపెనీకి పది కోట్లు నష్టం వచ్చిందని సుభాష్ అంటాడు. కానీ రాహుల్ ఆ డిజైన్స్ తియ్యలేదు అంటున్నాడు.. పైగా స్వప్న కూడ సపోర్ట్ చేస్తుంది. తెలుసుకుంటా అన్నీ తెలుసుకుంటానని సుభాష్ అంటాడు.

మరొకవైపు ఇంట్లో పనిమనిషికి కావ్య రిపోర్ట్స్ కన్పిస్తాయి. అవి చూసి రుద్రాణి షాక్ అవుతుంది.. అంటే కావ్యకి ప్రాబ్లమ్ ఇంకా ఉంది అన్నమాట అనుకుని హాల్లో ఉన్న అందరికి రిపోర్ట్స్ చూపిస్తుంది. అవి సుభాష్ చూసి షాక్ అవుతాడు. ఏమైందని అపర్ణ అడుగగా మనకి కావ్య ప్రాబ్లమ్ తగ్గిపోయిందన్నారు కానీ తగ్గలేదని చెప్పగానే అందరు షాక్ అవుతారు.

అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేసారని అపర్ణ కోప్పడుతుంది. మా దగ్గర ఎందుకు నిజం దాచారని అడుగుతుంది. కావ్యకి తన కడుపులో పెరుగుతున్న బేబీని చంపుకోవడం ఇష్టం లేదు.. అందుకే ఇలా.. కానీ దీనికి పరిష్కారం దొరికింది.. గుళ్లో పంతులు కావ్య సమస్య విని కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించమని చెప్పారు.. దాంతో క్షణం ఆలస్యం చేయకుండా మీతో టూర్ కి వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోయామని రాజ్ అంటాడు. అక్కడ వైద్యం చేసి కావ్యకి ప్రాబ్లమ్ లేదని చెప్పారనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

తరువాయి భాగంలో రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు వస్తుంది. రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.