English | Telugu
Bigg Boss Telugu 9 Top 5: బిగ్ బాస్ సీజన్-9 టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్ళే!
Updated : Dec 14, 2025
బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, సంజన టాప్-7 మిగిలారు. ఇక వీరి నుండి ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు.
శనివారం నాటి ఎపిసోడ్ లో.. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున చెప్పేశాడు. ప్రస్తుతం హౌస్ లో భరణి, సంజన, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్ ఆరుగురు మిగిలారు. వీరిలో ఆడియన్స్ ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటే వాళ్ళే ఎలిమినేట్ అవుతారు.
అయితే సోషల్ మీడియా బిగ్ బాస్ లీక్స్, అప్డేట్స్ ని బట్టి చూస్తే ఆదివారం ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్(Bharani Elimination) అయినట్టు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్, సంజన, ఇమ్మాన్యుయేల్ ఈ అయిదుగురు హౌస్ లో ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వగా.. ఇమ్మాన్యుయేల్ సెకెండ్ ఫైనలిస్ట్ అయ్యాడు.