English | Telugu

Thanuja second vote Appeal:రెండోసారి ఓట్ అప్పీల్ చేసుకున్న తనూజ.. పాపం సంజన!

బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగో వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టాస్క్ లలో గెలిచి స్కోర్ బోర్డుపై ఎక్కువ పాయింట్లు కలిగిన కంటెస్టెంట్స్ తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ముగ్గురు. ఇక‌ వీరిలో మీతో పాటు ఓటు అప్పీల్ కి ఎవరిని తీసుకొని వెళ్తారు తనూజ అని బిగ్ బాస్ అడుగుతాడు. ఆల్రెడీ ఇమ్మాన్యుయేల్ కీ ఓటు అప్పీల్ ఛాన్స్ రావడంతో సంజనని సెలెక్ట్ చేసుకుంటుంది తనూజ.

సంజన, తనూజ ఇద్దరు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ అడియన్స్ ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తారని బిగ్ బాస్ ఆడియన్స్ ని అడుగుతారు. ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు. దాంతో తనూజకి మళ్ళీ ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. సంజన హౌస్ లోపలికి వెళ్తుంది. తనూజ ఓటు అప్పీల్ చేసుకుంటుంది. ఆడియన్స్ కొంతమంది తనూజని కొన్ని ప్రశ్నలు అడుగుతారు.

మీరు ప్రతీసారి ఏడుస్తారు ఎందుకు మీకు సింపథీ కోసమా అని ఒకావిడ అడుగుతుంది. అయ్యో అలా ఏం కాదండి.. ఎప్పుడు మా వాళ్ళు ఎవరో ఒకరు నాతో ఉండేవాళ్ళు కానీ హౌస్ లోకి వచ్చాక వీళ్ళు ఎవరో తెలియదు అలాంటప్పుడు ఎమోషనల్ అవ్వడం తప్పనిసరి అవుతుందని తనూజ చెప్తుంది. మీరు ఇమ్మాన్యుయేల్ మొహం పైనే.. నువ్వు నా ఫ్రెండ్ కాదని అన్నారు.. అలా అనడం కరెక్టేనా అని ఒక ఆడియన్ అడుగుతాడు. వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్.. మీకు క్లోజ్ ఫ్రెండ్ లేడా అని తనూజ అంటుంది. నేను అలా అనలేదని అతను అంటాడు. నేను హర్ట్ అయ్యాను.. వాడు హర్ట్ అవ్వాలి కదా అని తనూజ చెప్తుంది. అలా అతను అడిగే ప్రశ్నలకి తనూజ తడబడుతూ సమాధానం చెప్తుంది.