English | Telugu
Tanuja Fires On Bharani: భరణికి వెన్నుపోటు పొడిచిన తనూజ.. గెలిచేది ఆ ముగ్గురిలో ఒకరు!
Updated : Dec 12, 2025
బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. హౌస్ లో ఫినాలేకి వారం ఉంది కానీ ఇప్పుడే హౌస్ లో గ్రూప్ లుగా ఆడుతున్నారు. హౌస్ లో భరణి, సుమన్, సంజన ఒక టీన్. ఇమ్మాన్యుయేల్, డీమాన్, తనూజ, కళ్యాణ్ ఒక జట్టుగా అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
టాస్క్ లో భాగంగా ఎవరైనా టాస్క్ నుండి తొలగించండి అని బిగ్ బాస్ అన్నప్పుడు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డీమాన్ ముగ్గురు భరణి పేరు చెప్పారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ పేరుని భరణి చెప్తాడు. సంజన పేరుని తనూజ చెప్తుంది. ఎక్కువ ఓట్లు భరణికి పడడంతో భరణి టాస్క్ నుండి తొలగిపోతాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అందులో సంజన,ఇమ్మాన్యుయేల్ పాయింట్స్ సాధిస్తారు. డీమాన్, తనూజ పాయింట్స్ ఏం పొందలేకపోతారు. స్కోర్ బోర్డులో లీస్ట్ లో డీమాన్ ఉండడంతో గేమ్ నుండి తొలగిపోతాడు. తన పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వాలని చెప్పగా డీమాన్ తన పాయింట్స్ లో సగం తనూజకి ఇస్తాడు. దాంతో తనూజ లీడ్ లో ఉంటుంది. తదుపరి టాస్క్ నుండి తొలగించడానికి అందరు ఒకరిని ఎన్నిక చేసుకొని చెప్పమంటాడు బిగ్ బాస్. నాకు సపోర్ట్ చెయ్యి తనూజ అని భరణి తనని రిక్వెస్ట్ చేస్తాడు. లేదు.. నాకు ఇమ్మాన్యుయేల్ చాలాసార్లు స్టాండ్ తీసుకున్నాడని భరణితో తనూజ అనగానే అంటే నేను తీసుకోలేదా అని భరణి అంటాడు. ఇక అక్కడి నుండి భరణి వెళ్ళి.. నేను స్టాండ్ తీసుకోలేదట.. ఇమ్మాన్యుయేల్ స్టాండ్ తీసుకున్నాడంట.. ఎలా అంటుంది.. ఎంత హర్టింగ్ గా ఉందని భరణి బాధపడుతాడు.
ఇక ఎక్కువ భరణికి ఓట్లు పడడంతో తదుపరి గేమ్ లో భరణి ఆడడు... తర్వాతి టాస్క్ లో ఓట్ అప్పీల్ అనే ఇంగ్లీష్ లెటర్ ని ఫాస్ట్ గా సెట్ చేయ్యాలి. ఆ గేమ్ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తనూజ సెకండ్, సంజన థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. లీడ్ లో తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ఉంటారు.