English | Telugu

Brahmamudi : ఒంటరిగానే ఉంటానన్న రాజ్.. కావ్య పయనం ఎటువైపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -544 లో....కనకం ప్లాన్ ప్రకారం ముగ్గురు కూతుళ్లు అల్లుళ్ళతో దాంపత్య పూజ చేయిస్తుంది. అప్పుడే రుద్రాణి ఏం ప్లాన్.‌. ఏం నటన అని అంటుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం.. ఇప్పుడు సైలెంట్ గా ఉండమని అపర్ణ అంటుంది. ఇక్కడ నటన జరుగుతుంది. ఇప్పుడే అడగాలని రుద్రాణి అంటుంది. మీకు ఎన్ని తెలివితేటలు.. మీకు మించి నాకు తెలివి ఉంది కాబట్టి మీ నటన కనిపెట్టానని రుద్రాణి అంటుంది.

ఈ కనకం తనకి కాన్సర్ ఉంది త్వరలో చనిపోతానని చెప్పి రాజ్ ని మోసం చేసి ఇక్కడికి రప్పించిందని రుద్రాణి అనగానే.. అందరు షాక్ అవుతారు. అదేంటి అలా అంటున్నావ్.. ఆవిడకి నిజంగానే క్యాన్సర్ ఉందని రాజ్ అంటాడు. అయితే ఆ విషయం తననే చెప్పమను అని రుద్రాణి అనగానే.. చెప్పండి అని కనకంతో రాజ్ అంటాడు. నేను చెప్పింది అబద్దమని కనకం ఒప్పుకుంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. నా ఎమోషన్స్ తో ఆడుకున్నారంటూ కనకం, కావ్యలని రాజ్ తిడుతాడు. వాళ్ళ తప్పేముంది అంతా వెనక ఉండి మేమే నడిపించామని అపర్ణ, ఇందిరాదేవిలు చెప్తారు. ఈ విషయం కావ్యకి తెలియదని వాళ్ళు అంటారు. అయిన రాజ్ వినకుండా జీవితంలో తల్లి కూతుళ్ళను నమ్మలేనని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తుంది ఇందిరాదేవి. ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తే విడగొడతావా అని తిడుతుంది. అపర్ణ కూడా కొట్టబోయ్ ఆగిపోతుంది. ఇందులో మీ అమ్మ తప్పు లేదు.. ఏం అనకని ఇందిరాదేవి, అపర్ణలు కావ్యకి చెప్పి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. ఏంటి రాజ్ నువ్వు చేస్తుంది. ఏది చేసినా అది కావ్య తప్పు అంటున్నావేంటని అపర్ణ, ఇందిరదేవిలు రాజ్ పై కోప్పడతారు. మీకు మాట్లాడే హక్కు లేదు.. నన్ను మోసం చేశారని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఇక మీరు ఇలాంటి ప్రయత్నం చేయకండి. ఇక నేను ఒంటరిగానే ఉంటానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య కూడా అదే విషయం కనకం, కృష్ణమూర్తిలకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.