English | Telugu
Karthika Deepam2 : నాన్నగా నాతో ఉండు కార్తీక్.. దీపకి ఈ విషయం ఎలా చెప్తాడు?
Updated : Oct 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -178 లో... కార్తీక్ కి కాశీ ఫోన్ చేసి.. శౌర్య కన్పించడం లేదని చెప్తాడు. శౌర్య నా దగ్గరే ఉందని కార్తీక్ చేప్తాడు. అప్పుడే దీప ఫోన్ తీసుకొన.. శౌర్య మీ దగ్గరున్న విషయం చెప్పాలి కదా అని దీప అనగానే.. ఎవరికి చెయ్యాలి. నీ ఫోన్ స్విచాఫ్ వచ్చిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నేను శౌర్య దగ్గరికి వెళ్తానని కాశీకి దీప చెప్తుంది. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. మా ఇంటికి రా అక్క కానీ నువ్వు ఊరు వెళ్లొద్దని కాశీ అంటాడు.
ప్లీజ్ కార్తీక్ అమ్మ వస్తే నన్ను ఊరు తీసుకొని వెళ్తుంది. నాకు అమ్మ కావాలి.. నువ్వు కావాలి.. ఇద్దరు నాతో ఉండాలి.. ఏం చెయ్యాలని శౌర్య అడుగుతుంది. నువ్వు నాన్నగా ఉంటే నాతో ఉంటావ్ కదా.. నా కోసం ఏదైనా చేస్తానన్నావ్ కదా.. నాన్న గా ఉండలేవా.. నాకు నీతోనే ఉండాలని ఉంది. మంచోడివి నాతో ప్రేమగా ఉంటావని కార్తీక్ పై తన ప్రేమని చెప్తుంది శౌర్య. మరొకవైపు మీ తాత మనసు మారక ముందే కార్తీక్ వాళ్ళింటికి వెళ్ళాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత కాంచన దగ్గరికి వెళ్లి మాట్లాడండి అని సుమిత్ర, దశరథ్ లతో శివన్నారాయణ అంటాడు. నేనే వెళ్తానంటూ జ్యోత్స్న వెళ్తుంది. మరొకవైపు నరసింహ దగ్గరికి అనసుయ వస్తుంది. తనని పోలీసులకి పట్టిస్తుంది. దాంతో అనసూయని కర్రతో కొడతాడు నరసింహా.
మరొకవైపు శౌర్య మాటలకి సమాధానం చెప్పకుండా వచ్చేసావ్ ఏంటని కాంచన అడుగుతుంది. అది చాక్లెట్.. బిస్కెట్.. అడుగుతలేదు.. నా జీవితం అడుగుతుందని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప వస్తుంది. శౌర్యని తీసుకొని వెళ్తానంటే.. కార్ వెనకాల పరిగెత్తి పడిపోయిందని దీప అనగానే.. హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చామని కార్తీక్ అంటాడు. లేట్ అయితే వెళ్లలేము శౌర్యని తీసుకొని వెళ్తానని దీప అంటుంటే కార్తీక్ కోప్పడతాడు. గొడవపడేలా ఉన్నారు.. శౌర్యకి ఆరోగ్యం బాలేదని వీడు చెప్పడు.. నన్ను వద్దన్నాడు.. ఇప్పుడేం చెయ్యాలని కాంచన అనుకుంటుంది. శౌర్య ఎక్కడికి రాదని దీపతో కార్తీక్ కోపంగా చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.