English | Telugu

పృథ్వీ ఎలిమినేషన్.. ఏడో వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇదే!

శనివారం రాగానే హౌస్ లో ఎవరేంటనే లెక్కల చిట్టా బయటకొస్తుంది‌. అయితే అన్నింటికంటే ముఖ్యంగా చూసేదేంటంటే ఎలిమినేషన్.. ఈ వారం ఎవరు హౌస్ లో ఎవరేంటి? ఎవరెలా ఆడారనేది నాగార్జున వార్నింగ్ ఇస్తే చూడటానికి అందరు సిద్దంగా ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ గా మారింది.

నామినేషన్లో ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ఓటింగ్ లో టేస్టీ తేజ, హరితేజ లీస్ట్ లో ఉన్నారు. వారిద్దరిపైన పృథ్వీ ఉన్నాడు. కానీ అనూహ్యంగా పృథ్వీ ఎలిమినేషన్ అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే దీనికి ఓ కారణం ఉంది. పృథ్వీ ఎంటర్‌టైనర్ కాదు.. కానీ టేస్టీ తేజ, హరితేజ ఎలాగోలో ఎంటర్‌టైన్ చేస్తారు. ఇంకా వారిద్దరు హౌస్ లో బాగా యాక్టివ్ మెంబర్స్ కానీ ఓటింగ్ లేదు. అందుకే బిగ్ బాస్ మామ మన విష్ణుప్రియ దోస్త్ పృథ్వీని బయటకి పంపించేశాడు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నెట్టింట ఇప్పుడు శనివారం నాటి ప్రోమో కోసం జనాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వేళ .. పృథ్వీ ఎలిమినేషన్ అనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది‌. మరోవైపు నాగార్జున ఎవరికి వార్నింగ్ ఇస్తాడో తెలుసుకోవాలని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.