English | Telugu

దిశ వాహనాలకు వైసీపీ రంగులు! గుంటూరు పోలీసుల అత్యుత్సాహం

కోర్టులు చివాట్లు పెట్టినా.. ప్రజలు ఛీదరించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి రంగుల పిచ్చి పోవడం లేదు. వైసీపీ నేతలే కాదు ప్రభుత్వ అధికారులది అదే తీరు. ఎవరేం అనుకుంటే మాకేందన్నట్లుగా అవే తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మన్ననలు పొందాలనే ఆశతోనే ఏమో.. పోలీస్‌ వాహనాలకూ వైసీపీ రంగులేశారు. దిశ వాహనాలకే కాకుండా, గతంలో కేంద్ర ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో  ప్రతి స్టేషన్‌కూ మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన బైక్‌లకూ  వైసీపీ స్టిక్కర్లు అంటించి దిశ పేరుతో ప్రారంభించారు.