నన్ను చంపుతారేమో.. అయినా భయపడేది లేదు! జేసీ ప్రభాకర్ రెడ్డి
ఎమ్మెల్యే మా ఇంటికి వస్తే ఎస్సై తలుపు తీయడం ఏంటి? హత్య వ్యవహారాల్లో ఉన్నవాళ్లకు గన్ మెన్లను ఇస్తున్నారు, కానీ మాకు భద్రత లేకుండా పోయింది. ఒకవేళ నన్ను చంపుతారేమో... అంతకుమించి ఇంకేం చేస్తారు? నా రాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. దేనికీ భయపడేది లేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను" అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.