English | Telugu

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎంపీ వి హనుంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా వరంగల్ లో జరుగుతున్న రైతుల ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా వీహెచ్ ను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ సరిహద్దులోని పెంబర్తి వద్ద హనుమంతరావును అదుపులోనికి తీసుకున్న పోలీసులు... అక్కడి నుంచి ఆయనను వ్యానులో లింగాల ఘనపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వరంగల్ వెళుతున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి.. రైతులను మోసం చేస్తున్నారని మండి పడ్డారు వి హనుమంతరావు.