English | Telugu
కొత్త స్ట్రెయిన్ కరోనా... మళ్ళీ లాక్ డౌన్ వైవు ప్రపంచం అడుగులు!
Updated : Dec 21, 2020
ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. ఈ కొత్త రకం కరోనా ఎంత వేగంగ వ్యాపిస్తోందంటే తాజాగా అమెరికా తర్వాత నిన్న ఎక్కువ కరోనా కేసులు బ్రిటన్‌లోనే నమోదయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ మొదటి పది దేశాలలో అన్నిటికంటే కింద ఉండే బ్రిటన్... ఇప్పుడు టాప్ 2 ప్లేస్ కి వచ్చేసింది. దీంతో ప్రజలు క్రిస్మస్‌కి దూరంగా ఉండాలనీ, ఇళ్లలోనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ తాజా నిబంధనలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి... మరణాల రేటు మాత్రం ఇప్పటి కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా మరికొన్ని నెలలపాటూ కఠిన నిబంధనలను కొనసాగించడం మేలంటున్నారు. ఈ కొత్త వైరస్ డిటైల్స్ పూర్తిగా అర్థం కాలేదనీ... అయితే మున్ముందు దీని వివరాలు పూర్తిగా తెలుస్తాయంటున్నారు.