కేసీఆర్, జగన్ బీజేపీ మిత్రులేనా ? మమత అందుకే పిలవడం లేదా?
ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్న నేతకు దిక్కు లేకుండా పోయిందా?ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను ప్రాంతీయ పార్టీల నేతలెవరు నమ్మడం లేదా? జగన్, కేసీఆర్ ను కమలం పార్టీ మనిషిగానే చూస్తున్నారా?.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో ఇదే నిజమేనని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో త్వరలో సమావేశం కాబోతున్నారు. కోల్ కతాలో జరగనున్న ఈ సమావేశానికి పలు పార్టీ నేతలను మమత ఆహ్వానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోల్ కతా ఆహ్వానం రాలేదు