కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)ధనుష్(Dhanush)కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'కుబేర'(Kuberaa). పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ ,మలయాళ, హిందీ భాషల్లో నిన్న రిలీజ్ అయ్యింది. నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)మొట్టమొదటిసారి తన కెరీర్ లో ఒక విభిన్నమైన రోల్ ని పోషించగా దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula)కూడా ఫస్ట్ టైం తన జోనర్ కి భిన్నంగా తెరకెక్కించాడు. జిమ్ సర్బ్, భాగ్యరాజ్, హరీష్ పెరడి, సునయన, దలిప్ తాహిల్, నాజర్, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.