English | Telugu

కుబేర మాస్ బ్యాటింగ్..రెండు రోజుల్లోనే 50 కోట్లు.. కానీ?

 

నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న కుబేర.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

 

కుబేర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ దాదాపు రూ.23 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా సుమారు రూ.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.25 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అనడంలో సందేహం లేదు.

 

అయితే తెలుగుతో పోలిస్తే తమిళ కలెక్షన్స్ డిజప్పాయింట్ గా ఉన్నాయి. తమిళ హీరో ధనుష్ నటించినప్పటికీ.. అక్కడి ప్రేక్షకులు తమ సినిమాలా దానిని పూర్తిగా ఓన్ చేసుకోవట్లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే రూ.24 కోట్లు రాబడితే.. తమిళనాట రూ.9 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. అంటే తెలుగు వసూళ్ళలో కనీసం సగం కూడా లేవు.

 

అఖండ 2 ఎంత కలెక్షన్స్ ని సాధిస్తుంది! ఫ్యాన్స్ చెప్తున్న లెక్క ఇదే 

థియేటర్స్ వద్ద గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అభిమానుల జాతరని వీక్షించడానికి   ముహూర్తం దగ్గర పడింది. అభిమానులు కూడా అందుకు తగ్గట్టే జాతర ఏ స్థాయిలో చెయ్యాలనే ప్రీ ప్రీపరేషన్స్ లో ఉన్నారు. దీన్నిబట్టి వాళ్ళల్లో అఖండ పార్ట్ 2 పై ఉన్న అంచనాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం వచ్చిన సెకండ్ క్యారక్టర్ మురళీకృష్ణకి సంబంధించిన టీజర్ తో అయితే ఆ అంచనాలు తారాస్థాయిలోకి చేరాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా అఖండ 2 కి సంబంధించిన పలు అంశాల గురించి అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. వాటిల్లో అఖండ 2 సాధించే కలెక్షన్ల అంశం కూడా ఒకటి.