English | Telugu
హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు!
Updated : Jun 22, 2025
హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయనపై చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాయదుర్గం పోలీసులు విజయ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'రెట్రో'. ఏప్రిల్ 26న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే ఆయన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు ఫిర్యాదు చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ విజయ్ గతంలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ విజయ్ పై కేసు నమోదైంది.