English | Telugu

రిలీజ్‌కి ముందే ఊచకోత మొదలెట్టిన బాలయ్య.. ఇక రికార్డుల మోతే!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ కెరీర్‌లో 2010 నుంచి 2021 వరకు ఎంతో కీలకమైన సంవత్సరాలుగా చెప్పొచ్చు. ఈ 11 సంవత్సరాల్లో బాలయ్య సాధించిన విజయాలు అలాంటివి. ఎంతో మంది డైరెక్టర్లు బాలయ్యకు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చారు. కానీ, వారిలో బోయపాటి శ్రీనుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్‌, అఖండ వంటి హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టింది. ‘అఖండ2 తాండవం’తో మరోసారి బాక్సాఫీస్‌ మీద విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సెప్టెంబర్‌ 25న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. హ్యాట్రిక్‌ సాధించిన కాంబినేషన్‌ కావడంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతోందని తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా మూవీగా ‘అఖండ2’ రిలీజ్‌ కాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అఖండ చిత్రాన్ని మించిన స్థాయి విజువల్స్‌ ఈ సినిమాలో ఉంటాయని ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్‌ చేసే ఇతర అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. బోయపాటి టేకింగ్‌, బాలయ్య పవర్‌.. వెరసి సిల్వర్‌ స్క్రీన్‌పై ఒక అద్భుతాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్‌ అన్నింటినీ చిత్రీకరించారు. ఇటీవలే ప్రారంభమైన చివరి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు క్లైమాక్స్‌ని కూడా షూట్‌ చెయ్యబోతున్నారు. ఈ షెడ్యూల్‌ ఆగస్ట్‌ వరకు కొనసాగుతుంది. రిలీజ్‌ డేట్‌ కూడా అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేసెయ్యడంతో బిజినెస్‌ కూడా స్పీడ్‌ అందుకుందని తెలుస్తోంది.

బాలకృష్ణ కెరీర్‌లోనే ‘అఖండ2’ థియేట్రికల్‌ బిజినెస్‌ భారీ ఎత్తున జరుగుతోందని సమాచారం. తెలుగు థియేట్రికల్‌ బిజినెస్‌ 120 కోట్లు దాటిందని తెలుస్తోంది. అలాగే ఇతర భాషలకు సంబంధించిన థియేట్రికల్‌ రైట్స్‌, ఓవర్‌సీస్‌ బిజినెస్‌ ఇవన్నీ కలిపి ఇప్పటికే 100 కోట్లు దాటింది. ఇక ఓటీటీ రైట్స్‌ 85 కోట్లకు ఇచ్చారని తెలుస్తోంది. టోటల్‌గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఇప్పటికే 300 కోట్లు దాటిందని సమాచారం. ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లో ఈ స్థాయి బిజినెస్‌ జరగలేదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలను మించే స్థాయిలో ‘అఖండ2’ ఉంటుందని, మరోసారి బాలయ్య పవర్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. రిలీజ్‌కి ముందే బిజినెస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తున్న ‘అఖండ2’.. రిలీజ్‌ తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.