English | Telugu

హీరోయిన్లు ఎదుర్కున్న లైంగిక సమస్యల కేసుని మూసివేసిన హైకోర్ట్.. సాక్ష్యాధారాలు లేవంటా! 

మలయాళ చిత్ర రంగంలో నటీమణులు ఎదుర్కుంటున్న లైంగిక ఇబ్బందులతో పాటు  వర్క్ కి సంబంధించిన  పలు సమస్యలపై కేరళ ప్రభుత్వం 'జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో హేమ కమిటీ(Hema Committee)కి చెందిన సభ్యులు మలయాళ చిత్ర పరిశ్రమపై పూర్తి అధ్యయనం చేసి, పరిశ్రమలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని నిర్దారించారు. అందుకు సంబంధించి సుమారు 235 పేజీల రిపోర్ట్ తో కూడిన నివేదికని కేరళ ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో పలువురు మాజీ, కొత్త నటీమణులు మలయాళ చిత్ర సీమలో తాము ఎదుర్కున్న లైంగిక సమస్యలని బహిరంగంగా వెల్లడించారు.