English | Telugu
క్యారవాన్ లో అనన్య నాగళ్ళ ఏడుపులు..ఉదయాన్నే జిమ్
Updated : Jun 21, 2025
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్(Pawan Kalyan')హిట్ మూవీ 'వకీల్ సాబ్' లో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల్లో తనకంటు ఒక గుర్తింపు పొందిన నటి 'అనన్య నాగళ్ళ'(Ananya Nagalla). రీసెంట్ గా ప్రకటించిన 'తెలంగాణ గద్దర్'అవార్డులకి(Telangana gaddar awards)సంబంధించి 'పొట్టేల్' చిత్రానికి గాను స్పెషల్ జ్యురి అవార్డు అందుకుంది. త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్న అనన్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది.
అనన్య తన లవ్ బ్రేక్ అప్ గురించి మాట్లాడుతు కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్ళని ఎదుర్కున్నాను. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండు సంవత్సరాలకి ప్రేమించిన వ్యక్తితో బ్రేక్ అప్ అయ్యింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. రెండేళ్ల పాటు ఆ బాధని అనుభవించాను. రాత్రి పూట ఏడ్చేసి ఉదయాన్నే జిమ్ కి వెళ్లేదాన్ని. షూటింగ్ టైంలో క్యారవాన్ లో ఏడ్చేసి ఏం తెలియనట్టుగా బయటకి వచ్చే దాన్ని. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం లేదు. కొంత మంది స్నేహితులకి మాత్రమే తెలుసనీ చెప్పుకొచ్చింది.
2019 లో ప్రియదర్శి(Priyadarshi)హీరోగా వచ్చిన మల్లేశం తో సినీ రంగ ప్రవేశం చేసిన అనన్య సినిమాల లిస్ట్ లో వకీల్ సాబ్,పొట్టేల్' తో పాటు శాకుంతలం, తంత్ర, డార్లింగ్, వంటి చిత్రాలు ఉన్నాయి. తెలంగాణాలోని ఖమ్మం(Khammam)దగ్గర ఉన్న సత్తుపల్లి అనన్య సొంత ప్రాంతం.
