English | Telugu
మనల్ని ఎవడ్రా ఆపేది.. జబర్దస్త్ లోకి నాగబాబు రీ ఎంట్రీ!
Updated : Jul 9, 2025
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి తెలుగునాట ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షో ద్వారా పలువురు నటులు వెండితెరకు పరిచయమై రాణిస్తున్నారు. జబర్దస్త్ లో కొందరు కంటెస్టెంట్స్ ప్రేక్షకుల హృదయాల్లో ఎలాగైతే పేరు సంపాదించారో.. జడ్జిగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ షోకి ఎందరు జడ్జిలు మారినా.. ఆడియన్స్ లో నాగబాబుకి ఎప్పుడూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అలాంటి నాగబాబు.. ఏవో కారణాల వల్ల కొన్నేళ్ల క్రితం జబర్దస్త్ నుంచి తప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన సడెన్ గా జబర్దస్త్ లో ప్రత్యక్షమయ్యారు.
జబర్దస్త్ షో ప్రారంభమై 12 ఏళ్ళు అవుతుంది. దీంతో మెగా సెలెబ్రేషన్స్ పేరుతో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ సెలబ్రేషన్ కి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఒకప్పుడు జబర్దస్త్ లో కంటెస్టెంట్లుగా చేసిన పలువురు కమెడియన్లు ఈ టీజర్ లో కనిపించారు. ముఖ్యంగా జడ్జిగా నాగబాబు రీఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే.." అంటూ పవన్ కళ్యాణ్ 'ఓజీ' డైలాగ్ తో నాగబాబు ఎంట్రీ చూపించారు. జడ్జి సీట్లో కూర్చున్న నాగబాబు.. "రావాల్సినోడు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ, ఆశ్చర్యపోతారు ఏంటి" అంటూ అందరిలో ఉత్సాహం నింపారు. అంతేకాదు, రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ "మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ మరింత జోష్ తీసుకొచ్చారు నాగబాబు.