English | Telugu

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4  యూ.ఎస్. ఏ  ఫైనలిస్ట్స్ వీళ్ళే


తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్ మొదలయ్యాయి. ఆహా ప్లాటుఫారం మీద ఈ షో ఇప్పటికే 3 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఐతే లాస్ట్ సీజన్ లో ఐతే దాదాపు 15 వేల మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేశారు. ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేయారు. ఇక కొత్త సీజన్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అమెరికాలో జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్ జరిగాయి అలాగే ఫైనలిస్టులు కూడా రెడీ అయ్యారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా. మనోజ్ఞ బెల్లంకొండ, రిషిత్ గద్దె, శ్రియ నందగిరి, స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రీజ కొఠారు, శ్రీష్టి చిల్లా..వీళ్ళ ఆరుగురు ఫైనల్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యారు. ఇక ఆహా వీళ్ళ పోస్టర్ రిలీజ్ చేసి...ఇండియా ఇక నీ టర్న్..ఆడిషన్స్ జరుగుతున్నాయి. రెజిస్ట్రేషన్స్ చేసుకోండి అంటూ కోరింది.

ఆల్రెడీ జూన్ 18 నుంచి ఆడిషన్స్ స్టార్ట్ చేసిన ఇండియన్ ఐడల్. ఐతే ఈ ఫైనలిస్టులను చూసిన నెటిజన్స్ , ఫైనల్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన వాళ్లంతా కూడా వాళ్ళను విష్ చేస్తూ మెసేజెస్ పెడుతున్నారు. ఇక లాస్ట్ సీజన్ చూస్తే నసీరుద్దీన్ టైటిల్ విన్ అయ్యాడు. దాంతో థమన్ ఓజి మూవీలో ఒక సాంగ్ ని నసీరుద్దీన్ తో పాడించాడు. అలాగే ఫస్ట్ రన్నరప్ గా అనిరుద్ సుస్వరం, సెకండ్ రన్నరప్ గా శ్రీకీర్తి నిలిచారు. వీళ్ళు అప్పుడప్పుడు బుల్లితెర మీద వచ్చే షోస్ లో పాడుతూ ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అలాగే కొన్ని మూవీస్ లో కూడా వీళ్ళు సాంగ్స్ పాడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. జడ్జెస్, హోస్ట్ ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.