అరేయ్ చూడండిరా...కీర్తి సురేష్ గారు నన్ను పొగిడారు..
సుహాస్ బిగ్ స్క్రీన్ మీద ఆచి తూచి మంచి మూవీస్ చేస్తూ ఉంటాడు. ఆయన చేసే మూవీస్ తో ఇండస్ట్రీకి ఒక ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. కలర్ ఫోటో, ప్రసన్న వదనం, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి ఆడియన్స్ కి నచ్చే ఎన్నో మూవీస్ చేసాడు. ఐతే సుహాస్ మీద ఇంత వరకు నెగటివ్ ట్రోలింగ్ అనేది ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే తిడుతూ ఉంటారట. ఇక రీసెంట్ కీర్తి సురేష్, సుహాస్ సుమ చాట్ షోకి వచ్చారు. "పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అవకాశం వస్తే వీళ్లల్లో ఎవరితో డైరెక్షన్ చేస్తారు" అని సుమ అడిగింది. "వామ్మో నేను అంత రిస్క్ చేయలేను, టెన్షన్ పడలేను..డైరెక్షన్ మానేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను నిజంగా డైరెక్షన్ చేస్తే నాని అన్నతో చేస్తాను. డైరెక్షన్ అవ్వాలని ఉంది.