English | Telugu

అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది..జడ్జ్ చేసేవాళ్ళు ఉండరు

హీరోయిన్ లయ అందమైన తెలుగింటి అమ్మయిలా ఉంటుంది. ఆమె ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ లో నటించింది. ప్రేమించు, స్వయంవరం, అదిరిందయ్యా చంద్రం, మనోహరం వంటి మంచి మూవీస్ లో నటించింది. ఐతే తర్వాత పెళ్ళైపోయి అమెరికాలో సెటిల్ ఐపోయింది. రీసెంట్ గా నితిన్ తో కలిసి తమ్ముడు అనే మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పింది. "ఇండియన్ లైఫ్ స్టైల్ చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాల మంది మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఆర్డర్ పెట్టగానే ఫుడ్ కానీ గ్రోసరీస్ కానీ అందుబాటులో ఉంటాయి. మనకు ఫామిలీ లేకపోయినా బతికేయొచ్చు. ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు.

ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు. నిమిషాల్లో అన్ని పనులు ఐపొతాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇవే పనులు నేను అమెరికాలో చేయాలంటే తలప్రాణం తోకకొస్తుంది. అన్ని మనమే తెచ్చుకోవాలి..అన్నీ దూరాలుంటాయి. పార్కింగ్ ఎక్కడో ఉంటుంది. గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుని పార్కింగ్ వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బండిలో పెట్టుకుని ఇంటికి వెళ్లి అన్నీ మళ్ళీ సర్దుకోవాలి. ఏదన్నా ఒక్కటి కొనడం మర్చిపోతే అంతే సంగతి. ఆ వస్తువును ఆర్డర్ పెట్టుకోవడానికి ఉండదు. ఉన్నాయి కానీ ఆన్లైన్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తే మాత్రం ఆ ప్రోడక్ట్ కాస్ట్ కంటే కూడా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. అందుకే కంఫర్ట్ వైజ్ గా ఇండియానే బెస్ట్. కాకపొతే అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎం చేస్తున్నామో పక్కవాళ్ళు చూడరు..మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎలాంటి డ్రెస్ వేసుకున్న కామెంట్ చేయరు. ఎలా కావాలంటే అలా అక్కడ ఉండొచ్చు. ఎవరూ ఎవరినీ డిస్టర్బ్ చేయరు. రావచ్చా అంటూ ముందుగా కనుక్కుని వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు బెల్ రింగ్ చేయడం అంటూ ఉండదు. విజయవాడలో చిన్నప్పుడు ఉన్నాను. కానీ మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా అమెరికాలోనే సెటిల్ ఇపోయారు. విజయవాడలో ప్రస్తుతానికి ఎవరూ లేరు. నేను అక్కడికి వెళ్లి ఏమీ చేయలేను. " అని చెప్పారు లయ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.