English | Telugu

ఢీ షోలో ఇరగదీసిన పండు..ఫిదా ఐన జడ్జెస్.. 


ఢీ షో ఈ వారం ఎపిసోడ్ లో డాన్సర్స్ అంతా పోటా పోటీగా ఇదే ఫైనల్స్ అన్న లెక్కలో చేశారు. ఇక పండు డాన్స్ ఐతే ఇరగదీసేసాడు. నెక్స్ట్ లెవెల్ లో చేసి మంచి మార్కులు కొట్టేసాడు. షర్ట్ నిక్కర్ వేసుకుని నిక్కర్ జేబుల్లో పూలు పెట్టుకుని నుదుటిన నల్ల బొట్టు, బుగ్గన చుక్క పెట్టుకుని నెత్తిన పిలక వేసుకుని దానికి పూలు పెట్టుకుని మెడలో చైన్ వేసుకుని అసలు గెటప్ చూస్తేనే నవ్వొచ్చేలా ఉంది. ఇక సొంతంగా సాంగ్ రాసుకుని పాడుతూ చేసిన డాన్స్ ఐతే మాములుగా లేదు.

అందులో మళ్ళీ జాను లిరి గురించి కొన్ని లిరిక్స్ యాడ్ చేసాడు. జానులిరి డాన్స్ చేస్తే ట్రోల్ అవుతుంది అని ఆ ట్రోల్స్ మీద ఏడుస్తూ కూర్చుంటుంది అని రాసాడు. తర్వాత భూమిక డాన్స్ చేస్తే ప్యాంటు సర్దుకుంటుంది, మాష్టర్ మాష్టర్ అంటూ వెనక తిరుగుతూ ఫైనల్స్ కి వెళ్తుంది అంటూ ఆమె గురించి లిరిక్స్ ని రాసాడు. మా అభి మాష్టర్ డాన్స్ చేస్తే గ్రేస్ ఉంటాది, ఐ లవ్ యు అంటూ జడ్జెస్ కి సిగ్నల్ ఇస్తాడు, చివరికి మార్కులన్నీ దోచుకుంటాడు అంటూ అభి మాష్టర్ గురించి చెప్పాడు. ఇక చివరికి తన గురించి కూడా చెప్పుకుంటూ లిరిక్స్ రాసాడు. సెట్ లో అందమైన అమ్మాయిలకు తానంటే ఇష్టం అని తానొస్తే షో మొత్తం దున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు అంటూ ఫన్నీగా చెప్పుకున్నాడు. పండు డాన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది కానీ ఇంతవరకు టైటిల్ మాత్రం కొట్టలేదు. ఈ ఢీ సీజన్ 20 స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఈ సాలా కప్పు నమదే అంటూ చెప్తూ ఫ్యాన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇలా సాగిన పండు డాన్స్ కి జడ్జెస్ కూడా ఫిదా ఇపోయారు. ఇక రఘు మాష్టర్ ఐతే పండు సాంగ్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. నీ ఓన్ గా సాంగ్ రాసుకుని పాడావ్ బాగుంది..ఈ సాలా కప్పు నీదే అంటూ చెప్పారు. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ ఐతే పండు నువ్వు హడావిడి హడావిడి చేస్తావ్ చేస్తావ్ . చాలా మంది ఇలా చేస్తారు కానీ డాన్స్ చేయరు కానీ నువ్వు అన్ని చేస్తావ్ డాన్స్ కూడా చేస్తావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.