English | Telugu

Illu illalu pillalu : నర్మద కన్నీళ్ళకి  కరిగిన రామరాజు.. ప్రేమకి ధీరజ్ తోడుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -223 లో....నర్మద ఆఫీస్ కి వెళ్తు మావయ్య గారు వెళ్ళొస్తానని చెప్తుంది కానీ రామరాజు సైలెంట్ గా ఉంటాడు. నర్మద బాధపడుతు వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమకి ఇల్లు క్లీన్ చెయ్యమని శ్రీవల్లి చెప్పడంతో తను క్లీన్ చేస్తుంటుంది. అదంతా వేదవతి చూస్తుంది. ఈ ఇంట్లో ఏంటో చుట్టూ ఇంత మంది ఉన్నా ఎవరు మాట్లాడరని ప్రేమ బాధపడుతుంది.

ప్రేమ పనులు చెయ్యడం సేనాపతి చూస్తాడు. ఏంటి అమ్మ నీకు ఇష్టం.. ఇంట్లో ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. నువ్వు మన ఇంటికి రా అనీ సేనాపతి అంటాడు. కానీ ప్రేమ ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తుంటే ధీరజ్ వింటాడు. దాంతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత నర్మద ఆటోలో వెళ్తు.. అది నా కుటుంబం అందరు నా వాళ్ళు.. ఆ భాగ్యం వాళ్ళు నా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు.. అలా జరగకుండా చూడాలని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత రామరాజుతో మాట్లాడడానికి మిల్లుకి వెళ్తుంది నర్మద‌.

మావయ్య గారు నేను చెప్పేది వినండి.. అసలు ప్రేమ డాన్స్ క్లాస్ కి వెళ్తున్న విషయం నాకు తెలియదు. నాకు ఆమె నాన్న దూరంగా ఉన్నారు. మిమ్మల్ని అమ్మనాన్న అనుకుంటున్నా.. మీరు నాతో మాట్లాడకుంటే నాకు ఎలా అనిపిస్తదని నర్మద ఏడుస్తుంటే ఎడ్వకు మాట్లాడుతామని రామరాజు అంటాడు. నర్మద వెళ్తుంటే సాగర్ ఎదరుపడి సైలెంట్ గా ఉంటాడు. సాగర్ ని రామరాజు పిలిచి.. నీ భార్యని తీసుకొని వెళ్లి ఆఫీస్ దగ్గర దింపమని చెప్తాడు. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావని అడుగుతాడు. మీ వదిన చెప్పింది కదా అని ప్రేమ అంటుంది. ఇప్పుడే వెళ్లి తనతో ఎందుకు పనులు చేయిస్తున్నావని అడుగుతానని ధీరజ్ అంటాడు. నేను నీకు ఏమవుతానని అడుగుతావని ధీరజ్ తో ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.