English | Telugu

Jayam serial: శంకుతల చేసిన బిర్యానీ.. రుద్రని తను చూస్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-16 లో.......పైడిరాజు పేకాట ఆడుతు డబ్బు మొత్తం పోగొట్టుకుంటాడు. అప్పుడే చిలకజ్యోతిశ్యం చెప్పే అతను వస్తాడు. పైడిరాజు కుబేరుడు అవబోతున్నాడని చెప్తాడు. అప్పుడే ఒకతను వచ్చి డబ్బు ఇచ్చి.. పైడిరాజుని పేకాట ఆడమంటాడు. అతనికి వీరు కాల్ చేసి.. ఆ పైడిరాజు నేను చెప్పేది వినేలా చెయ్ అని చెప్తాడు. వీడు ఒక వేస్ట్ గాడు వట్టిగనే మన దారిలోకి వస్తాడని అతను వీరుతో అంటాడు.

మరొకవైపు ఇంట్లో అందరు ఖాళీగా కూర్చొని ఉంటారు. ఎవరు వంట చెయ్యడం లేదని పెద్దసారు వాళ్ళ మరదలు అడుగుతుంది. శకుంతల పెద్దమ్మ చేత వంట చేయిస్తానని గంగ చెప్పిందని ఇషిక అంటుంది. ఆ తర్వాత గంగ శకుంతల రూమ్ కి వెళ్లి.. అమ్మ మీ జుట్టు ఎలా ఉందో చూడండి అని జుట్టు వేస్తుంది. అలాగే బొట్టు పెట్టుకోమని చెప్తుంది. పెద్దసారు మీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. సర్ ఎన్ని రోజులు అయిందో కడుపు నిండా తిని.. మీరు తన కోసం అయినా వంట చెయ్యొచ్చు కదా అని గంగ అనగానే పదా అని శకుంతల గది లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే పెద్దసారు లోపలికి వస్తుంటాడు. శకుంతలని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పెద్దసారు దగ్గరికి గంగ వచ్చి అమ్మగారు మీకు ఇష్టమైన బిర్యానీ చేస్తున్నారని చెప్తుంది. నా భార్యలో మార్పు మొదలు అయిందని పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు.

శకుంతల కిచెన్ లో వంట చేస్తుంటే రుద్ర ఇంట్లోకి వస్తాడు. శకుంతల వాయిస్ విని అటుగా వెళ్తుంటే వద్దు మళ్ళీ డిస్టబ్ అవుతుందని రుద్ర వాళ్ళ అమ్మ అనగానే రుద్ర సైలెంట్ గా లోపలకి వెళ్తాడు. ఆ తర్వాత శకుంతల బిర్యాని చేసి అందరిని పిలుస్తుంది. రుద్రని అత్తయ్య చూస్తే గొడవ అయ్యేది మిస్ అయిందని వీరు డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.