English | Telugu

Brahmamudi : రాజ్ కోసం వెళ్ళిన కావ్య.. ఇదేనా బ్రహ్మముడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -794 లో.....సీతారామయ్యకి కాఫీ తీసుకొని వస్తుంది కావ్య. నువ్వు నిన్న రాజ్ తో ఎందుకు అలా మాట్లాడావ్.. ఇంట్లో అందరికంటే నువ్వే అలోచించి మాట్లాడతావనుకున్న కానీ ఇలా చేస్తావ్ అనుకోలేదని సీతారామయ్య అంటాడు. నేను ఎందుకు అలా మాట్లాడానో ఇప్పుడు నేను చెప్పలేనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి మా బావని ఏం చేసావ్.. నిన్నటి నుండి కన్పించడం లేదని కోప్పడుతుంది.

దాంతో ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. యామిని తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. అపర్ణ కోప్పడుతుంది. ఇక్కడ నుండి వెళ్ళమని అనగానే యామిని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆవేశంలో యామినిపై కోప్పడ్డారు కానీ రాజ్ తిరిగి వస్తే ముందు వచ్చేది యామిని దగ్గరికే యామిని ఇదంతా మనసులో పెట్టుకొని రాజ్ కి నెగెటివ్ చెప్తే ఏంటని యామినికి సపోర్ట్ గా రుద్రాణి మాట్లాడుతుంది. ఈ ఇంట్లో ఉంటూ ఆ యామినికి సపోర్ట్ చేస్తావా అని రుద్రాణిని ఇందిరాదేవి కోప్పడుతుంది. రాజ్ కన్పించడం లేదని కావ్య బాధగా లోపలికి వెళ్లి తన ఫోటో చుస్తూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ వచ్చి.. నేను ముందే చెప్పాను. వాడు చాలా బాధపడ్డాడని.. ఇప్పుడు చూడు ఏం జరిగిందోనని అపర్ణ అంటుంది. కాసేపటికి అపర్ణపై పడి కావ్య ఏడుస్తుంది.

అప్పుడే కావ్యకి రేవతి ఫోన్ చేసి.. రాజ్ ఇక్కడే ఉన్నాడని చెప్పగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా ఫ్రెండ్ దగ్గర అయిన ఉన్నాడట.. నేను తీసుకొని వస్తానని కావ్య ఎమోషనల్ గా వెళ్తుంటే హాల్లో ఉన్న అందరూ చూస్తారు. ఏంటి కావ్య అలా వెళ్తుందని ప్రకాష్ వాళ్ళు అనుకుంటారు. ఇంకేముంది రాజ్ కి మళ్ళీ ఏదో అయినట్టుంది. అందుకే అలా వెళ్ళిందని రుద్రాణి అంటుంది. అలా ఎందుకు అంటున్నావని రుద్రాణిపై కోప్పడుతుంది ఇందిరాదేవి. తరువాయి భాగంలో రేవతి ఇంట్లో ఉన్న రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. రాజ్ కి తలకి కట్టుకట్టి ఉంటే కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంటుంది. ఇంత ప్రేమ పెట్టుకొని నిన్న అలా మాట్లాడారని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.