English | Telugu

Brahmamudi : ఇంటికి వారసుడిని ఇవ్వడం నా భాద్యత.. శుభవార్త చెప్పిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -793 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. రాజ్ వెళ్తుంటే ఇందిరాదేవి, అపర్ణ ఆపి మేం కావ్యకి నచ్చజెప్పుతాం.. నువ్వు టెన్షన్ పడకని అంటారు. వద్దు తనకి ఇష్టం లేదు.. ఇన్ని రోజులు నా హెల్ప్ తీసుకుంటే అది ప్రేమ అనుకుని భ్రమ పడ్డాను అంతే అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కావ్య దగ్గరకు వచ్చి.. నువ్వు ఏం చేస్తున్నావ్.. అర్ధం అవుతుందా.. ఇన్ని రోజులు ఈ సమయం కోసం వెయిట్ చేసావ్.. తీరా ఇలా చేసావ్ ఎందుకు ఇలా చేసావ్ కారణం ఏంటని కావ్యని అడుగుతుంది ఇందిరాదేవి. ఏం లేదు నా కారణాలు నాకుంటాయని కావ్య అనగానే నువ్వు చెప్పవు ఇప్పుడే రాజ్ దగ్గరికి వెళ్లి గతం గురించి చెప్తానని అపర్ణ వెళ్లిపోతుంటే.. నేను తల్లిని కాబోతున్నానని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ విషయం ఆయనతో ఎలా చెప్పాలి.. నా కడుపులో బిడ్డకి తండ్రి మీరే అని ఎలా చెప్పాలని కావ్య బాధపడుతుంది. నేను ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడం నా బాధ్యత.. అందుకే నేను ఆయనకు ఎదురు పడనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్ నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుండి ఏదో వచ్చి డాష్ ఇస్తుంది. మరొకవైపు రాజ్ కోసం యామిని చూస్తుంటుంది.

ఆ తర్వాత కావ్య అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. రాజ్ ని కావ్య రిజెక్ట్ చేసిందని కోపంతో ప్రకాష్, సుభాష్, ధాన్యలక్ష్మి కాఫీ తీసుకోకుండా తనతో కోపంగా మాట్లాడుతారు. పాపం దాని పరిస్థితి చుస్తే బాధగా ఉంది అత్తయ్య.. నిజం చెప్పలేక ఎవరు ఎమన్నా పడుతుందని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. అప్పుడే రుద్రాణి వచ్చి.. నీకు రాజ్ అంటే ఇష్టం కదా ఎందుకు వద్దన్నావని అడుగుతుంది. కావ్య కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. తరువాయి భాగంలో మా బావ ఎక్కడ నిన్నటి నుండి ఇంటికి రాలేదని కావ్య దగ్గరికి వస్తుంది యామిని. రాజ్ ఎక్కడికి వెళ్ళాడని ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.