English | Telugu

హరిహరవీరమల్లుకి మూడో హీరో 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)సుమారు మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు 'హరిహర వీరమల్లు' గా థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ప్రీమియర్ షో కూడా ప్రదర్శించడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా పవన్ కెరీర్ లోనే వీరమల్లు బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి జరిగిన ప్రమోషన్స్ లో పవన్ మాట్లాడుతు సంగీత దర్శకులు 'కీరవాణి' గారు లేకపోతే వీరమల్లు మూవీ లేదని, మేము డల్ గా ఉన్న ప్రతిసారి ఆయన ఇచ్చిన ఆర్ఆర్ తో కొత్త ఉత్సాహం వచ్చేదని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు మూవీ చూసిన ప్రేక్షకులు కీరవాణి(Keeravani)గురించి పవన్ చెప్పిన మాటలు అక్షర సత్యమని, తన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీరమల్లుకి చాలా ప్లస్ అయ్యాడని చెప్తున్నారు. మూవీలో అద్భుతంగా నటించిన మొదటి హీరో 'పవన్ కళ్యాణ్' అయితే, భారీ బడ్జెట్ తో నిర్మించి ఎన్నో వ్యయప్రయాసలని ఓర్చుకొని రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ ఏఎంరత్నం' (Am Rathnam)రెండో హీరో. మూడో హీరో కీరవాణి(Keeravani)అనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఔరంగ జేబు క్యారక్టర్ లో బాలీవుడ్ అగ్రనటుడు 'బాబీడియోల్' కనిపించిన వీరమల్లులో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ చేసింది. రఘుబాబు,సునీల్, సుబ్బరాజు, నాజర్, సత్యరాజ్ ఇతర పాత్రల్లో కనిపించగా క్రిష్ ,జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.