English | Telugu

అఖండ-2 కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్స్ ఇవే 


-జీవో జారీ చేసిన ప్రభుత్వం
-టికెట్ రేట్స్ ఇవే
-నైట్ నుంచే బాలయ్య జాతర


ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)ప్రభుత్వం “అఖండ-2 తాండవం'(Akhanda 2)చిత్రానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ (జనరల్-ఎ) శాఖ నుంచి డిసెంబర్ 9న జారీ చేసిన మెమో ప్రకారం,ఈ సినిమా విడుదలకు ముందురోజు అనగా డిసెంబర్ 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక్క బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ బెనిఫిట్ షోకు టిక్కెట్ ధరని 600 రూపాయలు (జీఎస్‌టితో సహా)*గా ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా పరిణామాల్లో భాగంగా చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ LLP సమర్పించిన అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పూర్వ ఉత్తర్వులను అధిగమిస్తూ ఈ అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా సినిమా విడుదలైన డిసెంబర్ 12వ తేదీ నుంచి పది రోజులపాటు సాధారణ ఐదు షోలకూ ప్రత్యేక చార్జీలను కూడా ఆమోదించింది.



ఇందులో భాగంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు అదనపు ఛార్జీ (జీఎస్‌టితో సహా)... అలాగే మల్టీప్లెక్సుల్లో 100 రూపాయిల అదనపు ఛార్జీ (జీఎస్‌టితో సహా) ప్రవేశ రుసుముల పెంపుదలకు జీ.ఓ.ఎం.ఎస్. నెం.13 (07.03.2022)లో ఉన్న మార్గదర్శకాలకు సడలింపులు కల్పిస్తూ ఈ ప్రత్యేక అనుమాతులు అమల్లోకి వస్తాయి. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Also read:ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మారుతి

ఈ నిర్ణయంతో అఖండ-2 తాండవం చిత్రానికి రిలీజ్‌కి పూర్తిగా లైన్ క్లియరైంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కాను న్నాయి. అలాగే మరుసటి రోజు డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ జరగనుంది.