English | Telugu
ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్ రా మావ!
Updated : Jul 24, 2025
ఫ్యాన్స్ సెలబ్రేషన్ లందు మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరయా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు.. మెల్బోర్న్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా 'వార్-2' సెలబ్రేషన్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు అక్కడి ఫ్యాన్స్.
'ఆర్ఆర్ఆర్' చిత్రం సమయంలో 'JAI NTR RRR' అని వచ్చేలా కార్లను ఇంగ్లీష్ లెటర్స్ లా పేర్చి సర్ ప్రైజ్ చేశారు మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ తర్వాత 'దేవర' మూవీ టైంలో 'DEVARA' అనే పేరు వచ్చేలా నీటిలో పడవలను పేర్చి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు 'వార్-2' వంతు వచ్చింది.
ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 25న ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నింగిలో స్మోక్ ఎఫెక్ట్ తో 'NTR WAR 2' అని రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.