English | Telugu
చిరంజీవిని కాదు.. పరిశమ్ర ఏజెంట్ ని
Updated : Dec 10, 2025
-చిరంజీవి స్పీచ్ వైరల్
-ఏం చెప్పాడు
-పరిశ్రమ ఏజెంట్ ని
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తన అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సదరు మూవీ నుంచి రిలీజైన 'శశిరేఖ' సాంగ్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. ఇక చిరంజీవి రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్( Telangana Global Summit)కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు నేను చిరంజీవిగా గ్లోబల్ సమ్మిట్ కి రాలేదు. సినిమా పరిశ్రమ తరుపున ఒక రిప్రజెంట్ గా వచ్చాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసాను. అప్పుడు నాతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయిలో హబ్ ని చేస్తాను అని చెప్పారు. కాకపోతే వెంటనే జరుగుతుందా అని అనుకున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ వ్యవధిలోనే తెలుగు సినిమా కేంద్రంగా హైదరాబాద్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)గారి విజన్ కి ప్రపంచ స్థాయిలో తెరకెక్కే సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ జరగడం ఖాయం. కళాకారుల యొక్క స్కిల్స్ అందరికి తెలిసేలా సినీ వర్క్ షాప్ ని కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
also read:మా పరిస్థితి అర్థం చేసుకోండి.. ఫ్యాన్స్‌కి డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన