English | Telugu

అడ్వాన్స్ బుకింగ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అఖండ 2

-అఖండ 2 జోరు
-అభిమానుల హంగామా
-గంటకి ఎన్ని బుకింగ్స్

అఖండ 2(Akhanda 2)ఆగమనానికి ముహూర్తం దగ్గర పడుతుండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, సినీ సర్కిల్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. మూవీపై ఇప్పటికే పాజిటివ్ టాక్ రన్ అవుతుండటం, ప్రచార చిత్రాల ద్వారా సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య శివ తాండవం ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలియడంతో అందరు ఇప్పుడు ఆన్ లైన్ వేదికగా టికెట్స్ బుక్ చేసుకునే పనిలో పూర్తి ఏకాగ్రతని కనపరుస్తున్నారు.


అందుకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో బుక్ మై షో వంటి యాప్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో గంటకి 4 వేలకి పైగా బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది. బాలయ్య ప్రభంజనానికి ఇదొక నిదర్శంగా చెప్పవచ్చు. ఇక ఈ రికార్డు పై మేకర్స్ కూడా అధికారంగా స్పందిస్తు బాక్స్ ఆఫీస్ పై బాలయ్య సర్జికల్ స్ట్రైక్ అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు జై బాలయ్య అంటూ హల్ చల్ చేస్తున్నారు.

Also read: జైలర్ దర్శకుడి మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ ఉంటే.. మరో హీరో ఈ స్టార్!

మరి తెలంగాణ(Telangana)లో టికెట్లు తెరుచుకోకుండానే ఈ విధమైన ర్యాంపేజ్ చూపిస్తున్న బాలయ్య.. రెండు రాష్ట్రాల టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయితే, తన మార్క్ తో పూనకాలు తెప్పించడం ఖాయమంగా తెలుస్తోంది. ఇక ఈ రోజు నైట్ తెలంగాణ ఏరియా కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.