English | Telugu

మీరేమీ పతివ్రతలు కాదు.. సమంత రెండో పెళ్లిపై మాధవీలత ఎటాక్‌!

2021లో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్న సమంత.. డిసెంబర్‌ 1న కోయంబత్తూరులో దర్శకనిర్మాత రాజ్‌ నిడుమోరును సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. రాజ్‌కి కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న రోజు నుంచీ సమంతపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నారు. ఓ పక్క అక్కినేని అభిమానులు సమంతను ట్రోల్‌ చేస్తుండగా, కొందరు సాధారణ మహిళలు, నటీమణులు కూడా సమంత తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు.

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం అనారోగ్యానికి గురైన సమంత.. ఆ తర్వాత క్రమంగా కోలుకొని సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ వస్తున్నారు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని ఎంతో మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు వారే ఆమెను విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకు మించి సమంతపై ట్రోలింగ్‌ జరుగుతోంది. అది రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

సినిమా రంగానికి సంబంధించిన విషయమైనా, రాజకీయ రంగానికి చెందిన అంశమైనా తన స్పందన తెలియజేయడంలో ఎప్పుడూ ముందుంటారు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత. ఇప్పుడు సమంతను విమర్శిస్తున్న ట్రోలర్స్‌కి రివర్స్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. సమంత పెళ్లి విషయంలో మాధవీలత చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె ఎలా స్పందించారు, ట్రోలర్స్‌కి ఎలాంటి కౌంటర్‌ ఇచ్చారు అనేది తెలుసుకుదాం.

‘పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు ఎంపిక చేసుకుంటారు. ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా. ఆ విషయంలో మీరు సంతోషించాలి. సమంత రెండో పెళ్లి చేసుకుంటే కొందరు బాధపడుతున్నారు. మీకెందుకు అంత బాధ అనేది నాకు అర్థం కావడం లేదు. ఎవరి సంసారమో కూల్చేసింది అన్నట్టుగా కామెంట్‌ చేస్తున్నారు.

అలాంటి కామెంట్స్‌ చేసే వారు.. ముందు తమ పర్సనల్‌ లైఫ్‌లో ఎన్ని రిలేషన్‌ షిప్స్‌లో ఉన్నారో ప్రశ్నించుకోవాలి. మరొకరి సంసారాన్ని చెడగొట్టి పెళ్లి చేసుకునేవారు, విడాకులు ఇవ్వకుండానే వ్యవహారాలు నడిపేవారు ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంటే నాకు నవ్వొస్తోంది. మీరేమీ పతివ్రతలు కాదు కదా. ఇలాంటి కామెంట్స్‌ చేసే వారి గురించి నాకు బాగా తెలుసు’ అంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు మాధవీలత.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.