English | Telugu

ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఈ రోజే.. అభిమానుల్లో జోష్  

-అభిమానుల్లో భారీ అంచనాలు
-ak 47 అంటే ఏంటి!
-వెంకీ, త్రివిక్రమ్ మాయాజాలం షురూ

తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్(Venkatesh),మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikiram)కలయికలో కొత్త మూవీ గురించి అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఇద్దరి కలయికలోని మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళ్తుందా అని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా తెరకెక్కుతుండగా “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది. టోటల్ గా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్ గా కనిపిస్తున్నారు. అదే టైం లో హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది.


Also read:అఖండ-2 కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్స్ ఇవే

త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు ఉన్నాయి.వెకంటేష్ త్రివిక్రమ్ కలయిక మరోసారి ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. . టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ అద్భుత కలయిక తెరపై ఏ మాయ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో వెండితెరపై వినోదాల విందుని అందించడానికి టీం మొత్తం రెడీ అవుతుంది.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.