English | Telugu

మా పరిస్థితి అర్థం చేసుకోండి.. ఫ్యాన్స్‌కి డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన


-అఖండ 2 కోసం ఎదురుచూపులు
-డిస్ట్రిబ్యూటర్ల ట్వీట్
-అక్కడ ఏం జరుగుతుంది!

గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ 'బాలకృష్ణ'(Balakrishna)మూవీ రిలీజ్ రోజు అభిమానులు చేసే హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటిది శివ స్తుతుడుగా 'అఖండ 2 'తో బాలయ్య తాండవం చేస్తుంటే వాళ్ళ హంగామా మరో రేంజ్ లో ఉంటుంది. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసినా హంగామా విషయంలో తగ్గేదెలే అనే విధంగా ఉంటారు. ఇందుకు ఓవర్ సీస్ అభిమానులు కూడా మినహాయింపు కాదు . రీసెంట్ గా ఓవర్ సీస్ అభిమానులని రిక్వెస్ట్ చేస్తు అఖండ 2(Akhanda 2)ని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మోక్ష మూవీస్(Moksha Movies)ఒక ట్వీట్ చేసింది.

సదరు ట్వీట్ లో 'అఖండ 2’ మా సంస్థకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అభిమానులకి,ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే కలతో చాలా ప్లాన్లు చేశాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ చివరి సమయంలో థియేటర్లు అడ్జస్ట్ చేయడం పెద్ద ఛాలెంజ్. అయినప్పటికీ మేము కొంతవరకు విజయం సాధించాం. మీ షెడ్యూల్స్‌కి అనుగుణంగా షోస్ ప్లాన్ చేసేందుకు మీ మద్దతు కావాలి. థియేటర్లు షోటైమ్స్ ఫైనల్ చేస్తున్నాం. ఈ రాత్రికి లేదా రేపు పూర్తి లిస్ట్ ప్రకటిస్తాం. 11న USAలో గ్రాండ్ ప్రీమియర్స్ ఉంటాయని సదరు ట్వీట్ లో పేర్కొంది.

Also Read: అఖండ 2 ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా పడిన కొత్త చిత్రాలు

అభిమానులు కూడా మోక్ష మూవీస్ ట్వీట్ పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఎంత ఇబ్బంది వచ్చినా అఖండ 2 ని గ్రాండ్‌గా చూపిస్తారనే నమ్మకం ఉంది. లేటైనా సరే బెస్ట్ థియేటర్లల్లో మూవీ చూస్తామంటు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అభిమానులైతే ఏకంగా కొన్ని థియేటర్లని ట్యాగ్ చేస్తూ, అదనపు స్క్రీన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఓవర్ సీస్ లో అఖండ 2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.