English | Telugu

లెక్చరర్‌ ప్రేమలో పడిన రాశి.. అతనికి పెళ్లయింది. అయినా..!

కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను దాచిపెడుతూ ఉంటారు. ఎవరినైనా లవ్‌ చేశారా అని అడిగితే ఆ ప్రశ్నను దాటవేస్తారు. కొందరు మాత్రం ఆ విషయాలను చెప్పేందుకు మొహమాట పడరు. నిజాలు చెబితే తప్పేంటి అంటారు. అలా ఓ హీరోయిన్‌ తన ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆ హీరోయిన్‌ పేరు రాశీ సింగ్‌.

ఆది సాయికుమార్‌ హీరోగా వచ్చిన ‘శశి’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది రాశీ సింగ్‌. ఆ తర్వాత ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’, ‘ప్రేమ్‌ కుమార్‌’, ‘ప్రసన్న వదనం’ వంటి సినిమాలతో అందర్నీ ఆకట్టుకుంది. ఇటీవల రాజ్‌ తరుణ్‌ హీరోగా వచ్చిన ‘పాంచ్‌ మినార్‌’ చిత్రంలోనూ హీరోయిన్‌గా చేసింది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేసుకుంది.

‘కాలేజీలో చదువుకునే రోజుల్లో మా లెక్చరర్‌తో ప్రేమలో పడ్డాను. ఆయన చాలా స్మార్ట్‌గా ఉండేవారు. స్టడీ విషయంలో నాకు చాలా హెల్ప్‌ చేసేవారు. అంతేకాదు, వైవా సమయంలో నన్ను ఎలాంటి క్వశ్చన్స్‌ అడిగేవారు కాదు. ఇద్దరం రూమ్‌లో ఎంతో సరదాగా ఉంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అయితే మా ప్రేమలో హద్దులు దాటలేదు. ఆయనే నా ఫస్ట్‌ క్రష్‌. ఆయనకు ఆమధ్య పెళ్లయింది. అయినప్పటికీ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూనే ఉన్నారు’ అంటూ తన ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్పుకొచ్చారు రాశీ. ఎంతో ఓపెన్‌గా ఆమె చెప్పిన లవ్‌స్టోరీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.