English | Telugu

జైలర్ దర్శకుడి మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ ఉంటే.. మరో హీరో ఈ స్టార్!

-నెల్సన్ మల్టీస్టారర్
-ఆ మరో స్టార్ ఎవరు!
-ఎన్టీఆర్ కి కథ చెప్పాడా!

దర్శకుడిగా 'జైలర్'(Jailer)తో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు 'నెల్సన్ దిలీప్ కుమార్'(Nelson Dilipkumar). ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన రేంజ్ తో పాటు సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)రేంజ్ ని మరింత పెంచేలా 'జైలర్ పార్ట్ 2 ' ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది జూన్ లో థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఈ చిత్రం తర్వాత నెల్సన్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కథనాలు వినపడుతున్నాయి.


నెల్సన్ ఈ సారి ఇద్దరు బడా హీరోలతో మల్టి స్టారర్ చేయబోతున్నాడని, కానీ తమిళ హీరోలు కాకుండా తెలుగు హీరోలు ఉంటారనే వార్తలు ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి. ఒక హీరోగా మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ఉంటాడని, ఇంకో హీరో కోసం నెల్సన్ వెదుకులాటలో ఉన్నాడని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ నే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనేది నెల్సన్ డ్రీమ్. గతంలో ఎన్టీఆర్‌ కి నెల్సన్ ఒక కథ చెప్పాడని, ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

also read:అఖండ 2 ప్రీమియర్ కి పవన్ కళ్యాణ్! ప్లేస్ చెప్తారా!

సదరు చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో పాటు మరో హీరోతో నెల్సన్ మల్టి స్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ అభిమానుల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఒక వేళ మల్టిస్టారర్ న్యూస్ నిజమైతే ఎన్టీఆర్ తో పాటు ఇంకో హీరోగా చేసేది తెలుగు నుంచా లేక తమిళం నుంచా అనే చర్చలు కూడా వాళ్ళ మధ్య జరుగుతున్నాయి.