రాం రాం! మధురాంతకం రాజారాం!!
రచయితలనూ, కవులనూ కోల్పోయిన జాతి, తన బాల్యాన్నీ, భవిష్యత్తునీ కూడా కోల్పోతుందని నేనెక్కడో చదివాను. ఆ మాట నిజం అనిపిస్తోందిప్పుడు. అప్పుడు...నేను ‘ఉగాది‘వారపత్రికకు ఎడిటర్ గా ఉన్నప్పుడు...అలా అనిపించలేదు. చాలా ఆశాజనకంగా ఉండేవాణ్ణి. ముప్పయిమూడేళ్లనాటిమాటిది.
ఈనాడు, ఈవారాల్లో రిజైన్ చేసిన తర్వాత ‘ఉగాది’ వారపత్రికకి ఎడిటర్ ని అయ్యాను. అయితే ఆ రాని పత్రికకు కాని ఎడిటర్ గా మిగిలిపోయాను. మిగిలిపోతే మాత్రం ఏం? ఎన్ని జ్ఞాపకాలను మూటగట్టుకున్నానో!
Jan 27, 2025