Facebook Twitter
కర్మ ఫలితం!

పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకి కుటీరంలో బియ్యం నిండుకున్నాయి. అడవిలో పనులకు వెళ్లి న తన అయిదుగురు కమారులు వచ్చే వేళయింది. భోజనం వండటానికి బియ్యం గింజ లేదు.  భీముడు అసలే ఆకలికి తట్టుకోలేడు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? అన్నది పాలుపోలేదు కుంతీదేవికి.  పక్కనే ఒక గ్రామం వుందని తెలుసుకున్న కుంతీ దేవి.. ఆ గ్రామానికి వెళ్లి ఓ ఇంటి ముందు నిలబడి.. అమ్మా.. నేను  అయిదుగురు బిడ్డలు తల్లిని. నా బిడ్డలు పనులు మీద బయటకు వెళ్లి  మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేళయింది.   వండటానికి ఇంట్లో బియ్యం గింజ లేదు. కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్లి వంట చేసి పిల్లల ఆకలి తీరుస్తాను అని కోరింది.  

అయితే ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాళి. ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని నేను నా పిల్లలు కి స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు.అసలు మాఇంట్లో బియ్యం లేవు ఏమి లేవు " నీవు అయిదుగురు బిడ్డల్ని  కని పారేసి ఇలా అడుక్కుతిని సాకాలా.? వాళ్ళు తినకుంటే వాళ్లే ఆకలికి మాడి చస్తారు. నీవు పో మా ఇంటి దగ్గర నుండి అంటూ దుర్భాషలాడింది.  నిష్కారణంగా నిందించింది. 

అయినా కుంతీదేవి మారుమాటాడకుండా  తలవంచుకొని హృదయం లో కలిగిన క్షోభను పైకి కనపడకుండా ఇంటికివచ్చింది.  ఆ రోజు  పాండవులు వస్తూ, వస్తూ  తమతో పండ్లు ఫలాలు తెచ్చి   ఆకలిని తీర్చుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది.

తెల్లారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది. ఒక ఇంట్లో ని పిల్లలందరూ పడుకున్నవాళ్ళు పడకున్నట్లు మృతి చెందారు. కారణం లేదు. ఆ నోటా ఈనోటా వార్త ధర్మరాజు వరకూ వచ్చింది. ధర్మరాజు తనకున్నదివ్యదృష్టితో చూసి సంగతి తెలుసుకున్నాడు.  

ఆఇంటి గృహిణి ఎన్ని దుర్భాషనలు తిట్లు శాపనార్దాలు పెట్టిన ఒక్కమాట అనకుండా తలవంచుకొని వచ్చిన తన తల్లి సహనం. క్షమా గుణాలకు ధర్మరాజు  తన తల్లి కి మనసులో నే నమస్కరించుకున్నాడు. తరువాత తల్లి దగ్గరకు వచ్చి తల్లి, నిన్నటి రోజు పక్కన గ్రామంలోకి ఎవరింటికైనా భిక్షం కోసం వెళ్ళావా? అని అడిగాడు. కాని కుంతీదేవి లేదు, నేను నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళ లేదంది. లేదు తల్లి నిజం చెప్పు, అంతా నాకు తెలుసు, ఆ గృహిణి నిన్ను అవమానించినా మారు పలకనందుకు ఆ దూషణలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు. అని చెప్పాడు.

ఎదుటి వారు మనల్ని నిష్కారణంగా మనల్ని దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓర్చావు. మనం మౌనంగా వున్నప్పుడు ఆ మాటలు మన ఎడమ కాలి గోటిని కూడా తాకవు. కాని మళ్ళీ మనం తిరిగి    శాపనార్దం పెడితే వాళ్ళ కి తిట్టినవారికి ఏమి కాదు. చెల్లు కు చెల్లు. కానీ మౌనంగా నీవు ఒక్క మాట అననందున ఆ శాపనార్ధాలు ఆమె బిడ్డలకి తగిలి వాళ్ళు మంచలోనే పడుకున్నవాళ్ళు పడుకున్నట్లు మృతిచెందారు.   నీవు తక్షణమే వెళ్లి ఆ గృహిణి తిరిగి దూషించిరా..  అని ధర్మరాజు చెప్పాడు.అంతట కుంతిదేవి గ్రామంలో నిన్న బిక్షకి వెళ్లి అడిగిన ఇంటికి వెళ్లి ...తిరిగి దూషించగానే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచి నట్లు లేచారు.    ఆ సంఘటన తో కుంతిదేవి సహనం కరుణ క్షమ గుణాలు ,   పాండవుల విలువ ఆ గ్రామమంతా తెలిసింది.  ఎవరైనా మనల్ని అకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు. అంటే ఎవరి కర్మ వారికే ఫలితం వెతికి మరీ ఇస్తుంది అన్నమాట.