Facebook Twitter
దెయ్యాల కొంప!

నువ్వెప్పుడు మేల్కొన్నా, ఒక తలుపు మూతపడుతుంటుంది. గదిలోంచి గదిలోకి వెళతారు, చేతిలో చేయి వేసుకుని, ఒకచోట ఎత్తి, మరొ చోట తెరచి వెళుతూంటారు.. దెయ్యం జంట. ‘ఇక్కడ మనం దాన్ని వదిలేశాం. ఇక్కడే ఆ వస్తువును వదిలేసింది. పైకి వెళ్లే మెట్ల దారిది’ ఆమె గుసగుసలాడింది. ‘అదుగో ఆ తోటలోకి వచ్చాం. మెల్లగా. వాళ్లు మేల్కొంటారు సుమా!’ అన్నాడతను.

 కానీ మమ్మల్ని మేల్కొల్పింది నువ్వుకాదు. ఓహో!  ఇంకా వాళ్లు దానికోసం వెతుకుతున్నారు. కర్టెన్‌ లాగుతున్నారు’  అని అనవచ్చు ఎవరేనా, ఒకటి రెండు పేజీలు ఇలా చదవవచ్చు. ఇప్పుడు వాళ్లు కనుగొన్నారు. ఒక్కటిమాత్రం కచ్చితం, మార్జిన్‌ దగ్గర పెన్సిల్‌ ఆపడం. ఆ వెంటనే, చదవడంవల్ల నీరసించి, లేచి ఎవరికోసమో చూస్తారు, ఇల్లంతా ఖాళీయే, తలు పులు బార్లా తెరచి వుంటాయి. చెక్కబొమ్మలు గాలికి కదిలి శబ్దంచేస్తున్నాయి. ‘ఇంతకీ  ఇక్కడికి  దేనికి వచ్చాను? దేని కోసం వెతుకుతున్నాను?’ నా చేతులు ఖాళీగా వున్నాయి. ‘బహుశా పైన వుండొచ్చునేమో?’ గాజుపాత్రలో ఆపిల్స్‌ వున్నాయి. తోట లోనూ బొమ్మల్లా వున్నాయి, కేవలం పుస్తకమే గడ్డి మీదకి జారిపడింది.

 కానీ వాళ్లు డ్రాయింగ్‌రూమ్‌లో చూశారు. అప్పటికి ఎవరూ చూడలేదని కాదు. కిటికీ అద్దాల్లో ఆపిల్స్‌, రోజాలు, ఆకుపచ్చని ఆకులూ ప్రతిఫలిస్తున్నాయి. డ్రాయింగ్‌రూమ్‌లో అవి కదిలినపుడు ఆపిల్‌ పసుపురంగువేపు తిరుగుతోంది. అయినా, క్షణం తర్వాత, తలుపు తెరుచుకుంటే, పెద్ద గదిలో గోడలకి, సీలింగ్‌కి వేలాడుతూ కనిపించేవేమిటి? నా చేతులు ఖాళీయే.  అంతటా నిశ్శబ్దం. నిశ్శబ్ద తరంగాలు రాజ్యమేలుతుంటాయి. ఒక్కసారిగా, అడవి పావురం  శబ్దం చేస్తుంది, ఇల్లంతా శబ్దం మెల్లగా విస్తరించింది.. ‘భద్రం..అంతా భద్రమే’ అంటూ. 

క్షణం తర్వాత దీపం కాంతి తగ్గిపోయింది. అక్కడ మరి గార్డెన్‌లో? చీకటిని చెట్లు చిలుకుతున్నాయి..తొలి వెలుగు రాకకోసం. ఎంతో బావుంది, ఎన్నడూ చూడనిది.. గాజుపలక కింద సన్నని వెలుగురేఖ జారిపోతోంది. గాజుపలకే మరణం. ఇద్దరి మధ్యనున్నది మరణమే.  ముందుగా ఆమెకు వచ్చింది..వందల యేళ్ల క్రితం, ఈ ఇంటిని నిర్మానుష్యంగా వదిలేసింది. కిటికీలు మూతబడ్డాయి, గదులన్నీ చీకటిమయం. అతను ఆ ఇంటిని వదిలేశాడు, ఆమెను, ఉత్తర తూర్పు ప్రాంతాన్ని సయితం. ఆకాశంలో దక్షిణాన చుక్కలు పొడిచాయి.  ఆ ఇంటిని గుర్తించారు.. అంతా భద్రమే..ఎక్కడో దిగంతాల్లోంచి..నీ నిధులంతా భద్రమే అంటూ.

 చాలాదూరం వరకూ కిటికీ రెక్కలు శబ్దం చేస్తున్నాయి. గాలి దుమారానికి చెట్లు తలలూపుతున్నాయి అటు ఇటూ. వర్షంలో చంద్రకాంతి వెదజల్లినట్లు పడుతోంది. కానీ దీపం కాంతి వెలుగురేఖ మాత్రం కిటికీలోంచి నేరుగా పడుతోంది. కొవ్వొత్తి కదలక మెదలక వెలుగుతోంది. ఆ దెయ్య్ దంపతులు ఇల్లంతా తిరుగుతూ, కిటికీ తలుపులు బలవంతంగా వేస్తూ,  తమ నిద్రకు భంగం కలిగించవద్దని మెల్లగా వేడుకుంటున్నాయి. 

 ‘ఇక్కడే మనం పడుకున్నది  ఆమె అన్నది.  ముద్దులకు అంతేలేదు .  పొద్దుటే లేచాం.. చెట్లమధ్య వెండిలా మెరిసింది సూరీడు కిరణాలు మెట్లపైన ,  గార్డెన్‌లో ..  ఎండాకాలం వచ్చేసింది.. చలికాలం మంచుకురిసే వేళలో దూరంగా ఎక్కడో తలుపులు మూసుకుంటున్నాయి, గుండె కొట్టుకుంటున్నట్టు బహు సుతారంగ ఇద్దరూ దగ్గరకు వచ్చారు. బయటకు వెళ్లే దారి తలుపులు మూసేశారు. గాలి గోల చేస్తోంది. వర్షం ధారాపాతంగా జారుతూ పచ్చిక మీద వెండిలా మెరుస్తోంది. మా చూపుకి ఏమీ కనపడటం లేదు, పక్కన ఎలాంటి సవ్వడినీ వినిపించుకోలేదు, ఎవరూ తన భయానక నల్లకోటును విప్పుతున్నట్టు చూడలేదు.

 వెండి లాంతరును పైకి పట్టుకుని దూరంగా చూశారు వాళ్లు. సుదూరంగా దృష్టి సారించారు. గాలి నేరుగా రివ్వున వీస్తోంది. దీపం వెలుగు కాస్తంత వంగిపోతుంది. అడవి వెన్నెల కాంతి రేఖలు నేలని, వంగిన ముఖాల్ని, గోడల్నీ దాటుతాయి. మళ్లీ కలుస్తూ నిద్రపోతున్న వారిని వెతుకుతూ వారి దాచిన ఆనందాన్ని కోరుకునే ముఖాలను మరకచేస్తాయి.

 సురక్షితమే అంటూ గృహ యజమాని గుండెకొట్టుకుంటుంది గర్వంగా.  చాలాకాలం తర్వాత మళ్లీ నన్ను కనుగొన్నావు  అతను నిట్టూర్చాడు.  ఇక్కడ.. నిద్రపోతోంది. తోటలో చదువుతోంది  నవ్వుతూ, అటకపై ఆ పిల్లను దొర్లిస్తోంది. ఇక్కడ మేము మా నిధిని వదిలిపెట్టాం.. వంగి, వాటి కాంతి నా కనురెప్పలు ఎత్తింది.  సురక్షితం, సురక్షితం!  ఇంటి నాడి విపరీతంగా కొట్టు కుంటుంది. నేను మేల్కొని అరుస్తాను, ‘ఓప్‌  ఇది మీ పాతిపెట్టిన నిధి? మీ హృది వెలుగు. 

-వర్జీనియా కథ ఉల్ఫ్ కు టి.లలితా ప్రసాద్ స్వేచ్ఛానువాదం