పవన్ తో పొత్తు.. వాట్ ఏ కామెడీ జగనా..
Publish Date:Dec 7, 2017
Advertisement
ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర మధ్య కాస్త గ్యాప్ లో జగన్ తన మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో జగన్ ని కొమ్మినేని .. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటారా అని అడిగారు. దానికి జగన్... “పవన్ తో నాకు పరిచయం లేదు . అయినా ఆయన ముందు చంద్రబాబు ప్రభావం నుంచి బయటకు రావాలి “ అని కలరింగ్ ఇచ్చాడు. కొమ్మినేని ప్రశ్న పెద్ద కామెడీ అనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జగన్ అంతకన్నా పెద్ద కామెడీ చేశారు. అసలు ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలను ప్రాతిపదిక చేసుకుని కలిసి పని చేద్దామని జనసేనకు వైసీపీ నేతలు ఎన్నో సందర్భాల్లో పిలుపు ఇచ్చారు. ఓ వైపు పవన్ ని చంద్రబాబు సన్నిహితుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఇంకో వైపు ఆయన్ని వైసీపీ కి దగ్గర చూసేందుకు ట్రై చేశారు. ఇలా ప్రయత్నించిన వైసీపీ నేతల్లో జగన్ కి అతి సన్నిహితుడు అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఒకరు. మరి ఇవేం తెలియనట్టు... తాను ఇందుకు అతీతం అంటున్నట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే..అసలు పవన్ కళ్యాణ్ జగన్ తో పొత్తు పెట్టుకోవాలి కదా. నిన్న జరిగిన సమావేశంలో పవన్ జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. జగన్ తో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. తండ్రి చనిపోయిన వెంటనే పదవులు కోసం వెంపర్లాడిన జగన్ కి సీఎం కుర్చీలో ఎక్కే అనుభవం ఎక్కడ ఉందని పవన్ పరోక్షంగా జగన్ ని టార్గెట్ చేశారు. అయితే పవన్ జగన్ ను టార్గెట్ చేసి మాట్లాడినా కూడా.. ఆయన ముందు చంద్రబాబు ప్రభావం నుంచి బయటకు రావాలి అని అన్నాడంటే....తాను ఓ రకంగా పొత్తు రెడీ అని చెప్పకనే చెప్పాడు. మరి జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే.. పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా రావడానికి ఆస్కారం ఉంటుంది.. లేదు.. నేను ఇలానే ఉంటా.. ఇలానే చేస్తా అంటే... అది తనకే నష్టం..
ఈ మధ్య జగన్ బలే కామెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్ర చేస్తూ.. అప్పుడప్పుడు కామెడీ చేస్తున్న జగన్ మరోసారి తన మీడియా సాక్షిగా కామెడీ చేశారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అదేనండీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. సాధారణంగా రాజకీయాల్లో పార్టీల పొత్తులు సహజమే. ఏపీలో బీజేబీ-టీడీపీ ఇప్పటికీ మిత్రపక్షంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీల కు పోటీగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా దిగింది. ఇక పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు సిద్దంగా ఉన్నాయి. వైసీపీ కూడా ఇందుకు అతీతమేం కాదు. వైసీపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది. ఇదే విషయంపై మాట్లాడిన జగన్.. అదేం లేదన్నట్టు... మాకు అంత అవసరం లేదు అన్నట్టు మాట్లాడి కామెడీ చేశారు.
http://www.teluguone.com/news/content/ys-jaganmohan-reddy-45-79144.html





