రాజారెడ్డి రాజ్యాంగం... వైఎస్ ఫ్యామిలీ రాజకీయం

Publish Date:Apr 2, 2025

Advertisement

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. పదవుల కంటే పాదయాత్రలతో పాపులర్ అయిన వైఎస్ కుమార్తెకు  రాజకీయంగా ఇప్పటి వరకూ ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో చెల్లి సేవలను వాడుకున్న జగన్ అధికారంలోకి రాగానే  ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. దాంతో షర్మిల వైఎస్ఆర్‌టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే సక్సెస్ మాత్రం కాలేకపోయారు. దాంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది జరిగిన వారంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవం బాధ్యతలను షర్మిల భుజాలపై పెట్టి పీసీసీ ప్రెసిడెంట్‌ని చేశారు. ఆ పదవి కట్టబెట్టక ముందు నుంచే షర్మిలకు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ చేయవద్దని ముందు నుంచే అడ్డం పడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్. అయితే ఆ మాజీ ఎంపీ విన్నపాన్ని కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంది. ఆ క్రమంలో హర్షకుమార్ కాంగ్రెస్‌కు రిజైన్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.  మరెక్కడా ఓపెనింగ్స్ లేవేమో ఆ సీనియర్ నేత కాంగ్రెస్ చూరే పట్టుకుని వేలాడుతున్నారు.

వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హైకమాండ్‌ను కోరిన హర్హకుమార్, ఆమెకు కావాలంటే జాతీయ స్థాయి పదవి ఇవ్వండని ఉచిత సలహా కూడా ఇచ్చారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని తిరిగిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చెల్లుబాటు అవుతుందని హర్షకుమార్ ప్రశ్నించారు. జగన్, షర్మిల ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి షర్మిల తన అన్నతో అరగంటసేపు మంతనాలు జరపాల్సిన అవసరం ఏమోచ్చిందని కొత్తకొత్త డౌట్లు కూడా అప్పట్లో రెయిజ్ చేశారు. జగన్‌కు మోడీతో, షర్మిలకు సోనియాతో లింకు పెట్టేసి కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, తాము సేఫ్‌గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమని మండిపడ్డారు హర్ష కుమార్.అలాంటి హర్షకుమార్ చాపక్రింద నీరులా తాడేపల్లి కోటరీతో చేతులు కలిపారా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. తనను టార్గెట్ చేస్తున్న షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు కూటమి సర్కారును ఇబ్బందుల్లో పెట్టడానికి జగన్ టీమ్ హర్షకుమార్ దళిత కార్డుని వాడుకోవడానికి స్కెచ్ గీస్తోందంట. 

కాంగ్రెస్ రక్తాన్ని వంటబట్టించుకున్న వైఎస్ ఫ్యామిలీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. తమ రాజకీయ  అవసరాల కోసం ఇంటాబయటా ఎవర్నైనా టార్గెట్ చేస్తారన్న టాక్ ఉంది. 1989లో వంగవీటి రంగా హత్య కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. సీఎంను మార్చడానికి 1990లో హైదరాబాద్ మత కలహాలూ ఆ పార్టీ సృష్టేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక 1999లో వరుసగా రెండో సారి ఓడిపోగానే  చెన్నారెడ్డి తెలంగాణా అంటూ విభజన రాగం ఎత్తుకుని హడావుడి చేశారు. 2009లో వైఎస్ మరణం తర్వాత తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపారని జగన్ అల్లర్లు సృష్టించారు. అదే జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖేష్‌ అంబానీకి తన తాడేపల్లి ప్యాలెస్‌లో రాజమర్యాదలు చేశారు. వైసీపీ కోటాలో అంబానీ టీమ్ మెంబర్‌కి రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టారు.

2015లో అప్పటి కూటమి సర్కారుని బదనాం చేయడానికి తుని ట్రైన్ తగల బెట్టించడానికి ముద్రగడను ముందు పెట్టి పావులు కదిపింది వైసీపీనే అన్న విమర్శలున్నాయి. ఇక అధికారంలోకి రావడానికి  2018లో కోడి కత్తి  డ్రామా, 2019  ఎన్నికల ముందు సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల చిచ్చు,  మొన్న ఎన్నికల ముందు పేదలు వర్సెస్ పెత్తందార్లు అంటూ నాటకం.. తాజాగా  పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం జగన్ పొలిటికల్ డ్రామాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి.

ఎవరు అవునన్నా కాదన్నా కులం.. మతం.. ప్రాంతాలను అడ్డు పెట్టుకుని, శవ రాజకీయాలు చేస్తూ ఆ పునాదుల పైనే, వైఎస్  ఫ్యామిలీ ఎదిగిందంటారు. అప్పుడు అయ్యా.. ఇప్పుడు కొడుకు.. తమ రాజకీయ ఎదుగుదల కోసం రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. ఇన్ని ఘటనలు కళ్ళ ముందు జరుగుతూ, రాష్ట్రం నష్టపోతున్నా, తెలుగుదేశం మీద ద్వేషంతోనో, కులం, మతం, ప్రాంతం మీద ఉండే ఉన్మాద అభిమానంతోనో, వాళ్ళని ఇంకా నమ్మే వాళ్ళు ఉండటం ఈ తెలుగు జాతి దౌర్భాగ్యమనే చెప్పాలి. లేకపోతే  హైదరాబాద్ టూ బెజవాడ, రాజమండ్రి టూ వీలర్ ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా రాజకీయం చేయడం ఏంటి?

By
en-us Political News

  
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.