నాదెండ్ల వెన్నుపోటు.. చంద్రబాబు ఎంట్రీ.. తీగల వెల్లడించిన సంచలనా వాస్తవాలు

Publish Date:Jun 1, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ  స్థాపన, ఆనాటి రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వాస్తవాలు వెల్లడించారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ ప్రభంజనం, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ తదితర అంశాలపై మాట్లాడారు. టిడిపి తొలి నాళ్లలో  ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆర్థికంగా పుంజుకున్న విధానాన్ని ఆయన  వివరించారు.

 1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చైతన్య రథంపై దిల్ సుఖ్ నగర్ వచ్చినప్పుడు తన తండ్రితో కలిసి తాను ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో మలక్‌పేట నియోజకవర్గంలో టిడిపి ఓడిపోతుందని తాను ముందే చెప్పానని..  కానీ రాష్ట్రవ్యాప్తంగా 200 సీట్లు వస్తాయని అంచనా వేశానని పేర్కొన్నారు. తాను చెప్పినట్టుగానే సరిగ్గా 202 సీట్లతో ఎన్టీఆర్ ఘనవిజయం సాధించారని, ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్ తనను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారని చెప్పారు.

మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.  అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబుకు తన గురించి చెప్పి మలక్‌పేట ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారని తీగల వివరించారు.

పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం సృష్టించినప్పుడు పార్టీలో తీవ్ర అల్లకల్లోలం నెలకొందని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో తాను, మాజీ ఎమ్మెల్యే గోపాల్ సహా నలుగురు నేతలు ఎన్టీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమించామని చెప్పారు. ఆ సంక్షోభం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ నమ్మకమైన కార్యకర్తలను ఆదరించారని, అందులో భాగంగానే తనను హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్‌గా, కడియం శ్రీహరిని వరంగల్ ఉడా చైర్మన్‌గా నియమించారని వెల్లడించారు.

టిడిపిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తానే కీలక సూచన చేశానని తీగల కృష్ణారెడ్డి  తెలిపారు.  మనం కేవలం ఎన్టీఆర్ ఇమేజ్‌పైనే గెలిచాం..  పార్టీ కలకాలం నిలబడాలంటే సభ్యత్వ నమోదు  ప్రారంభించాలని చంద్రబాబుకు తాను చెప్పానని తీగల అన్నారు.  కేవలం ఐదు రూపాయలు, వంద రూపాయల రుసుముతో కేవలం ఆరు రోజుల్లోనే 13 లక్షల రూపాయల నిధులు వచ్చాయని, ఆ తర్వాత అది కోట్ల రూపాయలకు చేరి పార్టీకి ప్రధాన వనరుగా మారిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి ఆనాడు హుడా చైర్మన్‌గా తానే ఎకరం భూమిని కేటాయించి, దానికి సంబంధించిన ప్రభుత్వ చెక్కులను ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద పంపించానని తీగల కృష్ణారెడ్డి  వెల్లడించారు.

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.