ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన తీవ్ర దుమారం

Publish Date:Feb 21, 2026

Advertisement

 

ఢిల్లీలో భారత్ మండపం వద్ద జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్  కాంగ్రెస్ కార్యకర్తల అర్థనగ్న ప్రదర్మన పెను దుమారం రేపుతోంది. ఈ నిరసన వెనుక అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీసే భారీ కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు పటియాలా హూస్ కోర్టులో ఆరోపించారు. అరెస్ట్ అయిన నలుగురు నేతలను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. గతంలో నేపాల్‌లో జరిగిన ఆందోళనల తరహాలోనే ఇది ముందుస్తు ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు తెలిపారు.

మరోవైపు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు షర్ట్‌లు విప్పి నిరసన తెలిపారు. ఈ ఘటనతో కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ నిరసనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. “దేశంలోని యువత, రైతులు, వ్యాపారుల ఆందోళనను యూత్ కాంగ్రెస్ సహచరులు వ్యక్తం చేశారు” అంటూ పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ వేదికలో పేర్కొంది. 

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా యువత, రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆరోపించింది. నిరసన తెలియజేయడం రాజ్యాంగబద్ధ హక్కు అని, ప్రజల స్వరం వినిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ స్థాయి సదస్సుకు అంతరాయం కలిగించడాన్ని ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ఈ ఘటనను తీవ్రంగా విమర్శించగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ  దేశ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు.

సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు  ఇమ్మాన్యుయేల్ , ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్  వంటి అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న నిరసన మరింత చర్చనీయాంశమైంది.కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, రైతు ప్రయోజనాలే తమకు ప్రాధాన్యమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. ప్రతిపాదిత ఒప్పందంపై పూర్తి వివరాలు వచ్చే నెలలో వెల్లడిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు క్యూఆర్ కోడ్‌లతో భారత్ మండపంలోకి ప్రవేశించి ఈ నిరసన చేపట్టారు.
 

By
en-us Political News

  
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.