ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కేటుగాడి ఎత్తుగడ

Publish Date:Apr 12, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి పరిశీలించారు. డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించినట్టు తేలడంతో వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా సంచలన విషయం బయటపడింది.

పోలీసుల తనిఖీల్లో కారులో నెంబర్ ప్లేట్ మార్పిడి కోసం ప్రత్యేకంగా యంత్రాంగం అమర్చినట్టు గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. వాహనంలో బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ మారే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. వేర్వేరు నెంబర్ ప్లేట్లతో ట్రాఫిక్ కెమెరాలను మభ్యపెట్టి చలాన్ల నుంచి తప్పించుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని పోలీసులు తెలిపారు.


కారు ఓనర్ తెలివితేటలు చూసి పోలీసులు  ఖంగు తిన్నాడు. ఆ నెంబర్ ప్లేట్లతో చెలగాటం చేయడం తీవ్ర మైన నేరమని, ఇది చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు కొనసా గిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటా మని పోలీసులు హెచ్చరించారు.

By
en-us Political News

  
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.