ప్రభుత్వ సలహాదారులుగా కార్టూనిస్టు శ్రీధర్, మంతెన సత్యనారాయణ రాజు

Publish Date:Feb 21, 2026

Advertisement

ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గా తెలుగు పాఠకులకు తన కార్టూన్ల ద్వారా చిరపరిచితుడైన  పోచంపల్లి శ్రీధర్ రావును, ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజులను ప్రభుత్వ సలహాదారులుగా   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం   నియమించింది.  శ్రీధర్ నుసమాచార ప్రచార విభాగం సలహాదారుగా, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రకృతి వైద్యం విభాగం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు  జారీ చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవులలో వారిరువురూ  రెండేళ్ల పాటు కొనసాగుతారు.   రాజకీయ, సామాజిక అంశాలపై తన కార్టూన్లతో  శ్రీధర్  ప్రజాభిమానాన్ని చూరగొన్న కార్టూనిస్ట్ శ్రీధర్ ను ప్రభుత్వం సమాచార ప్రచార విభాగం సలహాదారుగా నియమించి గౌరవించింది.  

అలాగే   ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా గుర్తింపు పొందారు. సహజ, సేంద్రీయ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా, సోషల్ మీడియాలో వీడియోల ద్వారా సత్యనారాయణ రాజు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రిని నిర్వహి స్తున్నారు. విజయవాడ, నరసాపురంలో కూడా సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం కేంద్రా లున్నాయి.

By
en-us Political News

  
ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకుంటున్నారా? ఆఖరి మ్యాచ్‌పై వీడని ఉత్కంఠ!
శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఈసారి పూర్తిగా సాధారణ ట్రాఫిక్ మధ్యనే ప్రయాణించడం నగరంలో ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.