Publish Date:Mar 13, 2026
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విండీస్ క్రికెటర్ జేవన్ సీర్లెస్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఒక ప్రైవేట్ T10 క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. ఈ కేసులో జేవన్ సీర్లెస్‌తో పాటు మరో ఇద్దరు అధికారులపై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. అవినీతి నిరోధక నియమావళి ప్రకారం మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు, అవినీతి చర్యలకు సహకరించడం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది.
సో ఆ విచారణ పూర్తయ్యే వరకూ అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచీ జేవన్ సీర్లెస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇలా ఉండగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించేందుకు ఐసీసీ జేవన్ సీర్లెస్ కు కొంత సమయం ఇచ్చింది. విచారణలో జేవన్ సీర్లెస్ దోషిగా తేలితే మరింత కఠిన శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. కాగా జేవన్ సీర్లెస్ గతంలో ఐపీఎల్ లో కూడా ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/windies-cricketer-sirles-suspended-36-215430.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.