9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు షాకింగ్ తీర్పు

Publish Date:Apr 6, 2026

Advertisement

 

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాతాంకుళం కస్టడీ డెత్ కేసులో కోర్టు సంచలనమైన తీర్పు వెలువడింది. తండ్రి–కుమారులపై జరిగిన దారుణ హింసపై విచారణ పూర్తి చేసిన మదురై కోర్టు 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తూ పోలీసు వ్యవస్థకు గట్టి హెచ్చరికగా మారింది. 2020లో కరోనా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో సాతాంకుళంలో మొబైల్ షాప్ నడిపినందుకు వ్యాపారి జయరాజ్ మరియు ఆయన కుమారుడు బెనిక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతించిన సమయానికి మించి దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో వారిని స్టేషన్‌కు తరలించారు.

అయితే పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తండ్రి–కుమారులు తీవ్ర హింసకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. తరువాత వారిపై నమోదైన ఆరోపణలు అసత్య మని బయటపడటం ఘటనను మరింత సంచలనంగా మార్చింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రజలు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం పలువురు పోలీసులపై హత్య, కస్టడీ టార్చర్ కేసులు నమోదు చేసి కోర్టులో దీర్ఘకాల విచారణ కొనసాగింది.

పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై హత్య ఆరోపణలు నిరూపితమయ్యాయని కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ముత్తుకుమార్ ఈ ఘటనను “అరుదైన కేసులలోకెల్లా అరుదైనది”గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్కు రెండు శిక్షలు విధించారు. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు మరణశిక్ష, 84.1 లక్షల జరిమానా విధించారు. ఇతర నిందితులందరినీ సమానంగా బాధ్యులుగా పరిగణించారు. ఈ తీర్పు దేశంలో పోలీసు దుర్వినియోగం, మానవ హక్కుల పరిరక్షణపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిపుణులు కూడా పోలీసు సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడు తున్నారు. సాతాంకుళం కేసులో వెలువడిన ఈ తీర్పు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంత‌టా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట‌ వినిపిస్తోన్న మాట‌.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.